Site icon HashtagU Telugu

Karungali Mala: మీ మెడలో ఈ ఒక్క మాల ఉంటే చాలు.. మిమ్మల్ని ఎవరూ టచ్ కూడా చేయలేరు..చేతబడి కూడా పని చేయదట!

Karungali Mala

Karungali Mala

కరంగుళి మాల లేదా ఓంకార్ మాల లేదంటే శివమాల.. ఇలా పేరుతో పిలిచినా కూడా ఒకటే అర్థం. ఈ వస్తువుని శివ భక్తులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మాల ఎంతో శక్తివంతమైనదిగా చెబుతారు. ఈ మాలను ధరించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని, ఎలాంటి సమస్యలనైనా అధిగమించవచ్చు అని చెబుతున్నారు. ఈ కరంగుళి మాలా ధరిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ మాల ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందట. ఏకాగ్రత పెరుగుతుందట. ధ్యానం యోగా వంటి ఆధ్యాత్మిక సాధనలకు సహాయపడుతుందని చెబుతున్నారు.

శివ భక్తులు ఇది మరింత శక్తివంతమైన పూజా వస్తువుగా పరిగణించాలట. ఇది శివుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడం కోసం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఆధ్యాత్మిక శక్తి పెరగడంతో పాటు మనిషికి అంతర శక్తి కూడా పెరుగుతుందట. చెడు శక్తులను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు అని చెబుతున్నారు. అలాగే చేతబడి వంటి వాటిని కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయట. చేతబడి వంటివి చేసినా కూడా మీకు ఎలాంటి నష్టం కలగదు అని చెబుతున్నారు. ఈ కరంగుళి మాల ధరించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. శరీరం ఆరోగ్యంగా ఉంటుందట. ఇది రక్తపోటును నియంత్రించడానికి, గుండె జబ్బులను నివారించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.

అలాగే వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనల్ని రక్షిస్తుందట. శరీరంలో శక్తి లభిస్తుందట. ఈ మాల ధరించడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయట. ఇది సానుకూల ఆలోచనలను ప్రోత్సహిస్తుందట. మానసిక స్థితిని మెరుగుపరుస్తుందట. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఎలాంటి ఒత్తిడినైనా చాలా సులభంగా మ్యానేజ్ చేయగలుగుతారట. కరంగుళి మాల ధరించడం వల్ల దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుందని, అదృష్టం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.