శ్యామల నవరాత్రులు 2026 తేదీలు, తిథి సమయం, పూజా విధానం..

శ్యామల నవరాత్రులు 2026 జనవరి 19 నుండి ప్రారంభమై జనవరి 27 ముగుస్తాయి. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజ గోప్యంగా చేసుకోవాలి.. ఈ శ్యామలా నవరాత్రులలో ఏ రోజు ఏ విధంగా పూజ చెయ్యాలి? పూజా విధానాలేంటి? ఈ విషయాలన్నీ మనం ఈ పోస్ట్ ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి సంవత్సరం మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు వస్తుంటాయి.. అవి ఏవిటంటే.. 1. మాఘమాసంలో  శ్యామలాదేవి నవరాత్రులు. […]

Published By: HashtagU Telugu Desk
Shyamala Navaratri 2026

Shyamala Navaratri 2026

శ్యామల నవరాత్రులు 2026 జనవరి 19 నుండి ప్రారంభమై జనవరి 27 ముగుస్తాయి.

వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజ గోప్యంగా చేసుకోవాలి..

ఈ శ్యామలా నవరాత్రులలో ఏ రోజు ఏ విధంగా పూజ చెయ్యాలి? పూజా విధానాలేంటి? ఈ విషయాలన్నీ మనం ఈ పోస్ట్ ద్వారా తెలుసుకుందాం.

సాధారణంగా ప్రతి సంవత్సరం మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు వస్తుంటాయి..

అవి ఏవిటంటే..

1. మాఘమాసంలో  శ్యామలాదేవి నవరాత్రులు.

2. ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు.

3. ఆషాడ మాసంలో వారాహి నవరాత్రులు.

4. చైత్రమాసంలో వసంత నవరాత్రులు.

ఈ శ్యామలా నవరాత్రులనే మాతంగి నవరాత్రులు అని కూడా అంటారు. ఈ నాలుగు నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయి..చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు,ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు మన అందరికి తెలుసు..కానీ మిగిలిన రెండు నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అంటారు..

ఈ గుప్త నవరాత్రులంటే సాధారణ పూజలు, వ్రతాలు లాగా అందరిని పిలిచి చేయరు. చాలా రహస్యంగా చేసుకుంటారు. గుప్త నవరాత్రులలో 9 రోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాలలో నవదుర్గలుగా అలంకరించి పూజలు చేసారు. దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులు చాలా విశేషమైనవి..

ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగంలో గానీ , వ్యాపారంలో గానీ అభివృద్ది కలుగుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది..అంతేకాదు ముఖ్యంగా పెళ్లికాని వారికి పెళ్లి అవుతుందని పురాణాల్లో తెలియజేసారు.

పూర్వం బండాసారుడు అనే రాక్షసుడిని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించి పదహారు  మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది…అందువల్లనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అనికూడా అంటారు. అంతేకాకుండా దశమాహావిద్యలలో మాతంగి అని కూడా పిలుస్తారు.

ఈ 2025వ సంవత్సరంలో మాఘమాసం మనకి జనవరి 19 శుద్ధ పాఢ్యమి సోమవారం నాడు ప్రారంభమై, జనవరి 27  మంగళవారం నాడు ముగుస్తుంది. శ్యామలా నవరాత్రులను మాఘమాస శుద్ధ పాఢ్యమి నుండి నవమి వరకు 9 రోజులపాటు జరుపుకుంటారు..

ఈ సంవత్సరం శ్యామలా నవరాత్రులు జనవరి 19 సోమవారం మాఘశుద్ధ పాఢ్యమి తిథితో ప్రారంభమై, జనవరి 27 మంగళవారం మాఘశుద్ధ నవమి తిథితో ముగుస్తాయి.

శ్యామల నవరాత్రి 2026 తేదీలు

మొదటి రోజు “జనవరి 19, సోమవారం” నాడు అమ్మవారిని “లఘు శ్యామలాదేవి” రూపంలో పూజిస్తారు.

రెండవ రోజు  “జనవరి 20, మంగళవారం” నాడు అమ్మవారిని

“వాగ్వాధినీ శ్యామలాదేవి” రూపంలో పూజిస్తారు.

మూడోరోజు “జనవరి 21 , బుధవారము” నాడు అమ్మవారిని “నకుల శ్యామలాదేవి” రూపంలో పూజిస్తారు.

నాల్గవ రోజు “జనవరి 22, గురువారం” నాడు అమ్మవారిని “హాసంతి శ్యామలాదేవి” రూపంలో పూజిస్తారు.

ఐదవ రోజు “జనవరి 23, శుక్రవారం” నాడు అమ్మవారిని “సర్వసిద్ధి మాతంగి” రూపంలో పూజిస్తారు.

ఆరవ రోజు “జనవరి 24, శనివారం” నాడు అమ్మవారిని “వాస్యమాతంగి” రూపంలో పూజిస్తారు.

ఏడవ రోజు “జనవరి 25, ఆదివారము” నాడు అమ్మవారిని “సారికా శ్యామలాదేవి” రూపంలో పూజిస్తారు.

ఎనిమిదవ రోజు “జనవరి 26, సోమవారం” నాడు అమ్మవారిని “శుక శ్యామలాదేవి” రూపంలో పూజిస్తారు.

తొమ్మిదవ రోజు “జనవరి 27, మంగళవారం” నాడు అమ్మవారిని “రాజమాతంగి లేదా రాజశ్యామలాదేవి” రూపంలో పూజిస్తారు.

శ్యామలాదేవికి నిత్యపూజాతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు మొదలగువాటిని పారాయణ చేస్తు పూజలు చేసుకోవాలి.

ఎరుపు రంగు పూవులతో అమ్మవారికి అలంకరణ చేసి , పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి..వీలైతే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి..

 

  Last Updated: 19 Jan 2026, 12:44 PM IST