శ్రావణమాసం మొదలైంది. ఈ శ్రావణమాసంలో పరమేశ్వరుడికి అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇక ఈ మాసంలోనే నాగుల చవితి పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు.. శ్రావణ మంగళవారం శ్రావణ సోమవారం శ్రావణ శుక్రవారం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ మాసంలోనే వరలక్ష్మీ వ్రతం కూడా జరుపుకుంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటితో పాటుగా శ్రావణమాసంలో నాలుగు శుక్రవారం కొన్ని రకాల నియమాలు పరిహారాలు పాటిస్తే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలగడంతో పాటు అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అంటున్నారు పండితులు.
మరి నాలుగు శుక్రవారాలు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది ఉదయం మాత్రం పూజ చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటిదేమీ లేదని, సాయంత్రం కూడా చేసుకోవచ్చని చెబుతున్నారు. కాకపోతే బ్రహ్మచర్యం పాటించాలట. అలాగే సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. ఇలా నాలుగు శుక్రవారాలు చేస్తే దరిద్రం తొలగిపోతుందట. పీఠం వేసి బియ్యం పోసి, దానిపై బట్ట వేసుకుని కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో బియ్యం, రూపాయి బిళ్ల మామిడి ఆకులు వంటివి పెట్టి ఏర్పాటు చేసుకోవాలి.
ఈ పూజకు కలశ ఆరాధన, గణపతి పూజ చేసిన తర్వాత షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత అంగ పూజ లక్ష్మి అష్టోత్తరాలు, కనక ధార స్తోత్రం చదవాలి. ఆ తర్వాత నైవేద్యాలను సమర్పించాలట. అలాగే తొమ్మిది దారాలు తీసుకొని, దానికి తొమ్మిది ముడులు వేసి వాటికి పూజ చేయాలట. ఆ తర్వాత ఆధారాన్ని కుడి చేతికి కట్టుకోవాలని, వ్రత కథ చదవాలని చెబుతున్నారు. శ్రావణమాసంలో ఈ విధంగా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుందట. అయితే ఇలా పూజలు చేసే సమయంలో ఇంట్లో స్త్రీలను భార్యను తిట్టడం అలాగే ఎక్కువగా ఖర్చు పెట్టడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. కాబట్టి ఈ రెండు పనులు చేయకపోవడమే మంచిది అని చెబుతున్నారు.