Tuesday: పెళ్లి కానీ అమ్మాయిలు మంగళవారం రోజు అలాంటి పని చేయకూడదా?

మామూలుగా హిందూమతంలో పెళ్లి కానీ అమ్మాయిలు పెళ్లి అయినా అమ్మాయిలకు మధ్య చాలా వరకు వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా పాటించే పద్ధతుల వ

  • Written By:
  • Publish Date - June 15, 2024 / 05:22 PM IST

మామూలుగా హిందూమతంలో పెళ్లి కానీ అమ్మాయిలు పెళ్లి అయినా అమ్మాయిలకు మధ్య చాలా వరకు వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా పాటించే పద్ధతుల విషయంలో ధరించే దుస్తులు, ఆభరణాల విషయంలో కూడా కొన్ని కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారు కొన్ని రకాల పనులు చేయడం నిషిద్ధం అని చెప్పినా కూడా వినిపించుకోకుండా కావాలని అలా పనులు చేసే వాళ్ళు ఉంటారు. అటువంటి వాటిలో మంగళవారం రోజు పెళ్లి కానీ అమ్మాయిలు తల స్నానం చేయకూడదు అన్న నియమం కూడా ఒకటి.

మరి మంగళవారం రోజు పెళ్లి కాని అమ్మాయిలు తన స్నానం చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెళ్లికాని అమ్మాయిలు అలాగే వివాహిత మహిళలు మంగళవారం నాడు తల స్నానం చేయకూడదు. అవివాహిత స్త్రీలు మంగళవారం తల స్నానం చేయడం వల్ల ప్రతికూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే మంగళవారం రోజున పెళ్లి కాని అమ్మాయిలు తమ జుట్టును కడగడం వల్ల వారి సోదరుడిపై అశుభ ప్రభావం పడుతుంది. కాబట్టి అలాంటి పొరపాట్లకు దూరంగా ఉండటం మంచిది.

అదేవిధంగా మంగళవారం రోజు పెళ్లి కాని అమ్మాయిలు తల స్నానం చేయడం వల్ల అంగారకుడు స్థానం బలహీనంగా మారవచ్చు. కాబట్టి మంగళవారం జుట్టును కడగకూడదు. ఇలా చేస్తే కుజుడు స్థానం బలహీనంగా మారవచ్చు. ఇది ఆ యువతి వివాహాన్ని ప్రభావితం చేస్తుంది. వివాహంలో జాప్యం అ్వడం, లేదంటే శుభ ఫలితాలు లభించవు. అందువల్ల, పెళ్లికాని అమ్మాయిలు మంగళవారం హెయిర్ వాష్ చేయకపోవడమే మంచిది.