9th day belief: పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల 9వరోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదా..?

తిథులు...అంటే కాలాన్నిలెక్కించడం కోసం ఏర్పాటు చేసుకున్న సంకేతాలు.

  • Written By:
  • Publish Date - June 6, 2022 / 08:00 AM IST

తిథులు…అంటే కాలాన్నిలెక్కించడం కోసం ఏర్పాటు చేసుకున్న సంకేతాలు. చాంద్రమానంలో 9వ తిథి నవమి. ఈ తిథి శుభకార్యాలకు అంతమంచిది కాదని చెబుతుంటారు. కానీ వివాహానికి మినహాయింపు ఉంది. నవమి విషయంలో ప్రయాణ నవమి, ప్రవేశ నవమి, ప్రత్యక్ష నవమి ఇలా ధర్మశాస్త్రం మూడు రకాలుగా వివరించింది. పుట్టింటికి వెళ్లినా లేదా బంధువుల ఇంటికి వెళ్లినా…9వ రోజు తిరుగు ప్రయాణం చేయరాదనేది ప్రయాణ నవమి నియమం.

ఇక ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి 9వ రోజు తిరిగి ఇంటికి రాకూడదని ప్రవేశనవమి హెచ్చరిస్తుంది. నవమి తిథి నాడు ప్రయాణాలు చేస్తే కష్టనష్టాలు ఎదురవుతాయని ప్రత్యక్ష నవమి చెబుతోంది. అందుకే నవమి తిథిని ప్రయాణాలకు నిషేధించారు. ఆడపిల్లను పార్వతీదేవిగానూ, లక్ష్మీదేవిగానూ చూడటం మన సంప్రదాయం. నవమి తిథి అనేది అధిష్టాన దేవత దుర్గాదేవి. శక్తికి ప్రతిరూపమైన ఆడపడుచును అత్తగారింటికి ఆడపిల్లను పంపుతూ ఆమె ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని పుట్టినింటీకి, మెట్టినింటికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటారు. ప్రయాణ నవమిగా చెప్పుకునే 9వ రోజు ఆడకూతురును అత్తగారింటికి పంపించడం వల్ల సమస్యలు ఎదురవుతాయని విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలోనే 9వరోజు ప్రయాణం మంచిది కాదనే నమ్మకం ఏర్పడింది.