Ayodhya Opening: దేశంలో అయోధ్య రామమందిర నామం వినిపిస్తుంది. మందిరం ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పీఎం మోడీ, సహా వేలాది మంది వీఐపీలు, వీవీఐపీలు హాజరవుతారు. వీళ్ళే కాకుండా కోట్లాది మంది హిందూ భక్తులు రాముడి దర్శనం కోసం అయోధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది.
జనవరి 22వ తేదీన అయోధ్యలోని రాముడి విగ్రహాన్ని దర్శించుకోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామాలయ గర్భగుడిలో రామ్‌లల్లాను ప్రతిష్ఠించనున్నారు. అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు అయోధ్య నగరానికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చేసిన ప్రకటన వారిని అయోమయానికి గురి చేసింది. లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ క్రమంలో రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ కీలక ప్రకటన చేశారు. అయోధ్య నగరంలో రద్దీని నివారించడానికి, జనవరి 22న ప్రారంభోత్సవ వేడుకకు అయోధ్యకు రావాలని భక్తులను ఆహ్వానించలేదు.