Shivling Puja at Home: ఇంట్లో శివలింగానికి పూజ చేస్తున్నారా.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి?

మాములుగా చాలామంది ఇంట్లో శివలింగాన్ని పూజిస్తూ ఉంటారు. కొందరు మాత్రం ఎంతో శివలింగాన్ని పూజించకూడదని చెబుతూ ఉంటారు. ఇం

Published By: HashtagU Telugu Desk
Shivling Puja At Home

Shivling Puja At Home

మాములుగా చాలామంది ఇంట్లో శివలింగాన్ని పూజిస్తూ ఉంటారు. కొందరు మాత్రం ఎంతో శివలింగాన్ని పూజించకూడదని చెబుతూ ఉంటారు. ఇంతకీ ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా లేదా? ఒకవేళ పూజిస్తే ఎటువంటి పొరపాట్లు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శివపూజకు, శివుని అభిషేకానికి అనేక నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో పూజగదిలో ఉన్న శివలింగాన్ని పూజించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. శివారాధనలో ఈ నియమాలను పాటించడం తప్పనిసరి.

నిర్మల హృదయం భక్తి శ్రద్దలతో మహాదేవుడిని హరహర మహాదేవ శంభో శంకర అంటూ జలాన్ని సమర్పించిన శివయ్య సంతృప్తి చెంది భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుస్తాడు. ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించినట్లయితే క్రమం తప్పకుండా పూజలు చేయాలి. సమయాభావం వల్ల లేదా మరేదైనా కారణం వల్ల శివలింగానికి అభిషేకం చేయలేకపోతే ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించకండి. క్రమం తప్పకుండా శివలింగాన్ని పూజించకపోతే, మీరు మహాదేవుని ఆగ్రహానికి గురవుతారు. చెడు ప్రభావం ఆ ఇంటిపై పడుతుందని. అలాగే ఇంట్లో ప్రతిష్టించే శివలింగం మీ బొటనవేలు పొడవు కంటే ఎక్కువ ఉండకూడదు.

ఎందుకంటే శివ పురాణంలో మీరు మీ బొటనవేలు కంటే పెద్ద శివలింగాన్ని ఉంచుకుంటే అది జీవితంలో చెడు ప్రభావాలను కలిగిస్తుంది. ఇంట్లో శివలింగం ఉంటే ఎల్లప్పుడూ ఉత్తరం ముఖంగా నీటిని సమర్పించాలి. అలాగే పొరపాటున కూడా దక్షిణం లేదా తూర్పు ముఖంగా నీరు పెట్టవద్దు. ఉత్తరం వైపున ఉన్న నీటిని సమర్పించడం వల్ల శివ పార్వతుల ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. ఉక్కు పాత్రలో శివునికి నీళ్ళను సమర్పించకూడదు. ఎందుకంటే ఇలా చేయడం అశుభంగా పరిగణిస్తారు. ఎల్లప్పుడూ రాగి పాత్రలో నిండుగా ఉన్న నీటిని శివునికి సమర్పించాలి. ఇత్తడి పాత్రలను కూడా ఉపయోగించవచ్చు. పొరపాటున కూడా శివుని రుద్ర విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదు. అలాంటి చిత్రాన్ని కలిగి ఉండటం కుటుంబంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

  Last Updated: 21 Aug 2023, 09:24 PM IST