Site icon HashtagU Telugu

Shiva pooja: శివుడిని ఆ మూడు సందర్భాలలో ఏమి కోరుకున్నా సరే తప్పకుండా నెరవేరుస్తాడు!

Mixcollage 04 Jan 2024 07 02 Pm 8963

Mixcollage 04 Jan 2024 07 02 Pm 8963

భారతదేశంలో ఉండే హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. పరమేశ్వరుని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. సోమవారం రోజు పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ రోజున భక్తులు పరమేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడంతో పాటు ప్రత్యేకంగా నైవేద్యాలను కూడా సమర్పిస్తూ కోరిన కోరికలు నెరవేర్చమని వేడుకుంటూ ఉంటారు. అయితే మీ కోరికలో సంకల్పబలం ఉంటే కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని అంటూ ఉంటారు. ముఖ్యంగా బోలా శంకరుడు తప్పకుండా కోరికల్లో నెరవేరుస్తాడని పండితులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మూడు సందర్భాలలో పరమేశ్వరుని పూజించడంతోపాటు కోరికలు కోరితే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడట.

ఇంతకీ ఆ మూడు సందర్భాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మరి సోమవారం అనేది అత్యంత విశేష కరమైన ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఈరోజు శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తూ ఉంటారు. శివుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా ఉంటారు. ఈ కైలాసం వల్ల దుఃఖాలు తొలగిపోయి సకల సుఖాలు లభిస్తాయి. సోమవారం రోజు శివుని ఆరాధనకు అంకితం చేయబడిన రోజు ఈ రోజున ఏ శివలింగాన్ని అయితే ఈ విధంగా పూజిస్తారో అక్కడ కచ్చితంగా ఆ పరమశివుడు కొలువై ఉంటాడు. శివుడు క్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. శివున్ని పూజించే ప్రతి భక్తుని జీవితంలో ఎప్పుడూ కూడా దేనికి లోటు ఉండదు. శివుడు తన భక్తుల ప్రతి కోరికను తీరుస్తాడు.

చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అటువంటి శివుడు ఎంతో ప్రత్యేకంగా ఉంటాడు. కాబట్టి అలాంటి శివున్ని మనం కొన్ని రకాల ప్రత్యేకమైన నియమాలతో పూజిస్తే చాలా శుభం కలుగుతుంది. ఎందుకంటే లయకారుడిని శివున్నే మహదేవుడు అంటారు. శంకరుడు కచ్చితంగా శివుణ్ణి సెమి ఆకులతో పూజించడం వల్ల భగవంతుడు త్వరగా ప్రసన్నుడై భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కొన్ని నియమాలు ఉంటాయి. అవి కచ్చితంగా తెలుసుకోవాలి. అదేంటంటే తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత ముందుగా శివాలయానికి వెళ్లి ఉత్తరం లేదా తూర్పు దిశలో శివలింగం దగ్గర కూర్చోవాలి. దీని తర్వాత ఓం నమశ్శివాయ అనే మంత్రాలు జపిస్తూ శివలింగానికి నీటీతో అభిషేకం చేయండి. శివుడికి ఎంతో ఇష్టమైన పూలు బిల్వపత్రాలు, ఉమ్మెత్త, జమ్మి ఆకులను శివలింగానికి సమర్పించాలి.

తప్పనిసరిగా తెల్లని వస్త్రాలు జంధ్యం అక్షతలు జనపనాలను కూడా సమర్పించాలి. శివలింగానికి సమర్పించేటప్పుడు తాజాగా ఆకులను మాత్రమే ఉపయోగించాలి. ఎప్పటికప్పుడు కోసిన ఆకులతో మాత్రమే పూజను చేయాలి. అప్పుడు మాత్రమే ఆ శివుడి అనుగ్రహం కలుగుతుంది. సోమవారం రోజున ఎంతో విశిష్టత ఉంటుంది. కాబట్టి పరమశివుడికి అత్యంత భక్తిశ్రద్ధలతో మీరు పూజించినట్లయితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయవంతమవుతారు. అదృష్టం మీకు విపరీతంగా పడుతుంది. మీకు ఎంతో మంచి ఫలితాలు దక్కుతాయి. శివుడిని మూడు సమయాలలో పూజించగలిగితే మీకు జీవితంలో ఎన్నో సిరిసంపదలు కలుగుతాయి. అలాగే పరమేశ్వరుడు కూడా కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు.