Eating Rules: వారంలో బయటికి వెళ్ళేటప్పుడు ఏ రోజు ఏది తింటే వెళ్లిన పని సక్సెస్ అవుతుందో మీకు తెలుసా?

వారానికి ఏడు రోజులు. అందులో ఒక్కరోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. అందుకే ఆయా రోజుల్లో ఆయా దేవుళ్ళను ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 09:30 PM IST

వారానికి ఏడు రోజులు. అందులో ఒక్కరోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. అందుకే ఆయా రోజుల్లో ఆయా దేవుళ్ళను ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే కొందరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా దేవుడుకి దండం పెట్టుకొని బయటికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్లడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తారు. అయితే దేవుడికి ప్రార్థించడంతో పాటు కొన్ని రకాల పదార్థాలు తిని బయలుదేరడం వల్ల మీరు వెళ్లే పనులు విజయవంతం అవుతాయి. వారంలో 7 రోజులు ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఏం తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఆదివారం రోజు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నట్లయితే ఇంటి నుంచి బయలుదేరే ముందు తమలపాకు తినాలి. ఇలా చేయడం వల్ల ఆ పనిలో విజయం సాధిస్తారు. ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది.

సోమవారం రోజు ఏదైనా పని మీద బయటికి వెళుతుంటే ఇంటి నుంచి బయలుదేరే ముందు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీరు వెళ్లిన పని విజయవంతం అవుతుంది.

మంగళవారం రోజు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకొని బయలుదేరడం వల్ల ఆ వెళ్లే పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది.

అదేవిధంగా బుధవారం రోజు పని మీద బయటకు వెళ్లేటప్పుడు కొత్తిమీర ఆకులను తిని వెళ్లడం వల్ల ఎప్పటినుంచో నిలిచిపోయి పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.

గురువారం రోజు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్తున్నప్పుడు జీలకర్ర తిని బయలుదేయడం వల్ల వెళ్లే పని సక్సెస్ అవుతుంది..

శుక్రవారం రోజు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు పెరుగు, పంచదార కలిపి తినడం వల్ల వెళ్లే పని సక్సెస్ అవుతుంది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.

శనివారం నాడు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు చిన్న అల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్లడం వల్ల వెళ్లే పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ ఫుల్ అవుతాయి.