Site icon HashtagU Telugu

Shankh Naad: ఇంట్లో శంఖానాదం చేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుందా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

Shankh Naad

Shankh Naad

పురాణాల ప్రకారం క్షీర సాగర మథనం సమయంలో ఉద్భవించిన వస్తువులలో శంఖం కూడా ఒకటి. ఈ శంఖం పేరే పాంచ జన్యం. దీనిని శ్రీమహా విష్ణువు స్వీకరించాడని చెబుతున్నారు. శ్రీ మహాలక్ష్మి తోబుట్టువుగా కూడా శంఖాన్ని భావిస్తారు. అందుకే పూజా గదిలో శంఖానికి ప్రత్యేక స్థానం ఉందని చెబుతున్నారు దేవుడి గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయట. కాగా శంఖంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి దక్షిణావృత శంఖం, రెండవది వామావృత శంఖం. ఇందులో మొదట దక్షిణావృత శంఖం విషయానికి వస్తే.. దక్షిణావృత శంఖాలను ఎక్కువగా పూజలో ఉపయోగించరట. ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీ రంగు గీత ఉంటుందట. ఈ శంఖం కుడి వైపు తెరుచుకుని ఉంటుందట. ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి అభి ముఖంగా నిల్చొని శంఖం నుంచి నీటిని ధారగా పోస్తూ సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే కంటికి సంబంధించిన రోగాలు తగ్గుతాయట.

వామా వృత శంఖం విషయానికి వస్తే.. వామా వృత శంఖం ఎడమ వైపుకు తెరుచుకుని ఉంటుందట. మాములుగా అన్ని రకాల పూజల్లో తరచుగా వాడేది ఈ శంఖమే. ఈ వామావృత శంఖం ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు ఆ దరిదాపులకు కూడా రావట. కాగా శంఖనాదంతో ఉద్భవించే సానుకూల శక్తులు శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రవేశిస్తుందట. అలాగే శంఖనాదం జరిగిన ప్రదేశానికి చుట్టు పక్కల ఉండే క్రిమి కీటకాలు కూడా నాశనమైపోతాయట.

శంఖం ధ్వని విజయానికి, సుఖానికి,కీర్తి ప్రతిష్టకు,, సమృద్ధికి, లక్ష్మీ రాకకు ప్రతీకగా భావించాలని చెబుతున్నారు. రోజూ ఇంట్లో శంఖనాదం చేయడం వలన ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయట. శంఖనాదం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయట. శంఖనాదం వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, మనశ్శాంతి, వివాహప్రాప్తి కలుగుతాయని పండితులు చెబుతున్నారు. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనసులో ఉన్న కోరికలు తీరుతాయట. దీనిని షాపులో ఉంచుకొని పూజించిన వారికి రోజూ వ్యాపార, ధనాభివృద్ధి కలుగుతుందని, శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదట. ఏ ఇంట్లో శంఖాన్ని దేవుడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధన ధాన్యాలతో తులతూగుతుందట.