Shri Ram Lalla Virajman : అయోధ్య ఆలయంలో కొత్త విగ్రహ స్థాపనపై శంకరాచార్య అభ్యంతరం

  • Written By:
  • Publish Date - January 21, 2024 / 10:47 AM IST

మరికొద్ది గంటల్లో అయోధ్య ఆలయంలో బలరాముడు విగ్రహ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో జ్యోతిర్మఠ్‌ శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆలయంలో రామ్‌లల్లా వరిజ్మాన్‌ ఉండగా, కొత్త విగ్రహాన్ని ఎలా ప్రాణప్రతిష్ఠ చేస్తారని ప్రశ్నిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు ఆయన లేఖ రాశారు.

We’re now on WhatsApp. Click to Join.

1949లో జరిపిన తవ్వకాల్లో అయోధ్య పాత రామలయం ప్రాంతంలో రామ్‌లల్లా వరిజ్మాన్‌ (బాలరాముడు) విగ్రహం బయటపడింది. ఆ విగ్రహమే ఇప్పటివరకు పూజలందుకొంటూ వస్తున్నది. కొత్త ఆలయంలో ఆ విగ్రహాన్ని కాకుండా కొత్త విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అలా చేస్తే మరి పాత విగ్రహాన్ని ఏం చేస్తారని తన లేఖలో శంకరాచార్య ప్రశ్నించారు. గర్భ గుడిలో ఇలా కొత్త విగ్రహాన్ని ఏర్పాటుచేయటం శతాబ్దాల నాటి విగ్రహాన్ని అవమానించటమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లేఖ ఫై ట్రస్ట్ సమాధానం ఇచ్చింది. ఉత్సవ, మూల విరాట్టు విగ్రహాలు రెండూ ఉండొచ్చని, అందులో ఎలాంటి తప్పు లేదని, విగ్రహాలు రెండు రకాలు.. ఒకటి ఉత్సవ విగ్రహం.. రెండోది మూల విరాట్టు. మూల విరాట్టును ఎక్కడికీ ఎప్పటికీ కదిలించకూడదు. ఉత్సవ విగ్రహాన్ని శోభాయాత్రల సమయంలో బయటకు తీసుకొస్తారు. రామ్‌లల్లా చాలా చిన్నగా ఉంటుంది. అందుకే భక్తులకు 19 అడుగుల దూరం నుంచి కూడా కనిపించేలా గర్భగుడిలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నాం. రామ్‌లల్లాను కూడా గర్భగుడిలోనే ఒక పీఠంపై ఉంచుతాం’ అని ట్రస్ట్ స్పష్టం చేసింది.

మరోపక్క అయోధ్య ఆలయం లోపలి దృశ్యాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. సమ్మోహనపరిచే కాంతులతో రామాలయం కనువిందు చేస్తుంది. సహజమైన పుష్పాల సౌందర్యం తో అందర్నీ కట్టిపడేస్తుంది. ఇదిలా ఉంటె రేపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటిపూట సెలవును ప్రకటించారు. కొన్ని రాష్ర్టా లు పూర్తిగా, మరికొన్ని మధ్యాహ్నం 2.30 వరకు సెలవు ప్రకటించారు. యూపీ, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, పుదుచ్చేరి పూర్తి సెలవు ప్రకటించగా, గుజరాత్‌, రాజస్థాన్‌, త్రిపుర, ఛత్తీస్‌గఢ్‌, అస్సాం, ఒడిశా హాఫ్ డే సెలవు ప్రకటించాయి.

Read Also : Odisha : రేపు మరోచోట కూడా రామాలయం ప్రారంభం..