చాలామంది శనీశ్వరుడి పేరు వింటే చాలు భయపడిపోతూ ఉంటారు. ఆయనను పూజించాలి అన్న ఆయన ఆలయాలకు వెళ్లాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. కొందరు మాత్రం శనీశ్వరుడి అనుగ్రహం కోసం శని ఆలయాలకు వెళ్లి పూజలు కూడా చేస్తూ ఉంటారు. కాగా శనివారం రోజు శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ రోజున ఆయనని భక్తుశ్రద్ధలతో పూజించడం వల్ల కష్టాల నుంచి ఈ విముక్తి పొందడంతో పాటు ఆయన అనుగ్రహం కలిగి రాత్రికి రాత్రే జాతకాలు మారిపోవడం ఖాయం అని చెబుతున్నారు.
అయితే శని అనుగ్రహం కోసం శనివారం రోజు ఎలాంటి నియమాలు పాటించాలో ఆయనను ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శనీశ్వరుడిని భయంతో కాకుండా భక్తిశ్రద్ధలతో మనస్ఫూర్తిగా కొలిస్తే సకల శుభాలతో పాటు ఐశ్వర్యాలను కూడా ప్రసాదిస్తాడట. శనివారం లేదంటే త్రయోదశి తిథి వచ్చిన రోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలట. అలాగే ఆయనకు ఇష్టమైన పువ్వులు నల్లటి వస్త్రాలు సమర్పించి దానం చేసిన కూడా శుభ ఫలితాలు కలుగుతాయట. ఆయన ప్రసన్నుడవుతాడట. అలాగే అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందట.
వారంలో ఏడవ వారం శనివారం. శనివారానికి అధిపతి శనీశ్వరుడు. సంఖ్య శాస్త్రం ప్రకారం ఈ ఏడు అనే సంఖ్య శనీశ్వరుడికి చాలా ప్రీతికరం. కాబట్టి శనివారం రోజు శని గాయత్రి మంత్రాన్ని పఠిస్తే ఇంకా మంచి జరుగుతుందట. అలాగే శని అనుగ్రహం కావాలి అనుకున్న వారు నల్లటి వస్తువులు నల్ల నువ్వులు వంటివి సమర్పించాలని చెబుతున్నారు. నీలి రంగు పుష్పాలు సమర్పించాలని చెబుతున్నారు. తైలాభిషేకం చేసిన కూడా ఆయన సంతోషిస్తాడట. ఇనుప వస్తువులు కూడా దానం చేయవచ్చట. శనీశ్వరుడి ఆలయానికి వెళ్లేవారు ఎప్పుడూ కూడా నేరుగా ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకూడదు. ఆయన పాదాల వైపు మాత్రమే చూడాలట. అలాగే గుడి నుంచి బయటికి వెళ్లేటప్పుడు వీపు చూపించకుండా అలాగే వెను తిరిగి వెళ్ళాలట.