Site icon HashtagU Telugu

Shani Dev Worship: శని దోషంతో ఇబ్బంది పడేవారు ఇలా చేస్తే చాలు.. సమస్యలు పరార్!

Shani Dev Worship

Shani Dev Worship

మాములుగా చాలామంది జీవిత కాలంలో ఏలినాటి శని, అర్ధష్టమ శని, సాడేసాతి వంటి దోషాలతో బాధపడుతుంటారు. అయితే వీటి నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో శనిదేవుడు జీవితంలో భరించలేని కష్టాలను పెడుతుంటాడు. ముఖ్యంగా శని దేవుడికి కర్మలకు అధిపతి అంటారు. అంటే ఆయన మనం చేసే పనులను బట్టి మనకు ఫలితాలను ఇస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, కావాలని చెడు కర్మలు చేస్తే ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి. ముఖ్యంగా శనివారం, అది కూడా త్రయోదశి రావడం ఎంతో మహత్తుగా పరిగణిస్తారు.

We’re now on WhatsApp. Click to Join
ఈ రోజున శనిదేవుడికి మన శక్తికొలది పూజించుకోవాలని చెబుతుంటారు. శనిదేవుడికి ముఖ్యంగా తైలంతో అభిషేకం చేస్తే ఆయన సంతోష పడుతారట. అలాగే శనివారం రోజు పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. అలాగే ఈరోజున రావిచెట్టు నీడలో నల్లని చీమలకు చక్కెర వేయాలి. ఆంజనేయ స్వామికి సిందూర పూజలు చేస్తే ఇంకా మంచిది. అదేవిధంగా శనివారం, త్రయోదశి రోజున సాయంకాలం ప్రదోష సమయంలో శివుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు కల్గుతాయి. ఈరోజు ఆంజనేయస్వామివారి తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరిస్తే కూడా జీవితంలో ఎన్నో సంభవిస్తాయి.

Also Read: Gifts: కొత్తగా పెళ్లైన దంపతులకు పొరపాటున కూడా ఈ గిఫ్ట్ లు అస్సలు ఇవ్వకండి!

అలాగే ఏలినాటి ప్రభావం ఉన్న జాతకులు నవగ్రహాలకు సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం, దానాలు ఇవ్వడం వంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు కల్గుతాయి. ఇంట్లో ఈరోజు తప్పనిసరిగా పులిహోర చేసిస్వామి వారికి నివేదన చేయాలి. పైన చెప్పిన విధంగా చేస్తే శని దోషంతో బాధపడుతున్న వారు ఆ సమస్యలనుంచి బయటపడవచ్చు.

Also Read: Vastu Tips: మీ ఇంట్లో రావి చెట్టు పెరిగిందా.. అయితే వెంటనే ఇలా చేయండి?