Shani Trayodashi 2022: మే 14నాడు శనిత్రయోదశి…ఏలినాటి శని వదలాలంటే ఇలా చేయండి…!!

మే14 శనివారం...శనిత్రయోదశి. ఈ రోజంటే శ్రీ మహాశిష్ణువుకు ఎంతో ఇష్టం. ఈరోజున శనిదేవుడికి ప్రత్యేకపూజలు చేస్తే ఏలినాటి శని వదలిపోతుంది.

  • Written By:
  • Publish Date - May 13, 2022 / 08:40 PM IST

మే14 శనివారం…శనిత్రయోదశి. ఈ రోజంటే శ్రీ మహాశిష్ణువుకు ఎంతో ఇష్టం. ఈరోజున శనిదేవుడికి ప్రత్యేకపూజలు చేస్తే ఏలినాటి శని వదలిపోతుంది. అంతేకాదు ఎన్నో దోషాలు కూడా తొలగిపోతాయి. త్రయోదశి శనివారంనాడు వస్తే…ఆరోజును శని త్రయోదశి అని అంటుంటారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరం అందుకే ఈ రోజు శ్రీవెంకటేశ్వరస్వామికి పూజలు చేస్తుంటాం. అందుకే త్రయోదశి శనివారం వస్తే శివకేశవులకు ఎంతోప్రీతిపాత్రమైన దినమని పురాణాలు పేర్కొంటున్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయేదశినాడే. అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడిందంటారు. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమశని…తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్కులు చెబుతున్నారు.

హిందూధర్మశాస్త్రాల ప్రకారం శనివారంనాడు శ్రీమహాలక్ష్మీ, నారాయణుడు అశ్వత్థవృక్షంపై ఉంటారని పురాణాల్లో ఉంది. అందుకనే ఈ రోజున అశ్వత్థ వృక్ష సందర్శన సందర్శన, ప్రదక్షిణచేయాలి. శని త్రయోదశిరోజున సూర్యోదయానికి ముందుగానే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యాన్ని పెట్టాలి. నల్లనువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రంలో ఉంచి దానం చేస్తే మంచిదని చెబుతుంటారు.

జాతక రీత్యాశనేశ్వరుని ప్రభావం వల్ల కష్టాలు పడుతున్నావారు…ఈ శనిత్రయోదశి రోజును గుర్తుకు పెట్టుకుని పైన చెప్పిన విధులు తప్పకుండా నిర్వహించాలి. సూర్యోదయమునకు పూర్వమే శనేశ్వరునికీ నువ్వుల నూనె, నువ్వులతోనూ అభిషేకం చేసి నీలిరంగు పూలతో భక్తి పూర్వకంగా అర్చించాలి. బెల్లంను నైవేద్యం సమర్పించాలి.నల్లని వస్త్రం లేదా నీలం వస్త్రమును సమర్పించాలి. నల్ల నువ్వులను దానమిస్తే కూడా శని ప్రసన్నుడై తన ప్రభావంను తగ్గిస్తారని పురాణాల్లో ఉంది.

శని బాధలు తీరేందుకు ఇలా స్త్రోత్రం ఆచరించాలి.

‘‘నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజమ్‌..

ఛాయా మార్తాండ సంభూతం.. తం నమామి శనైశ్చరమ్‌’’

ఇంకో విషయం ఏంటంటే…శనేశ్వరుడు ఎన్ని ఇబ్బందులు కలిగిస్తాడో…మన జీవితంలో కొన్ని దశల్లో అంతకుమించిన మేలును కూడా కలిగిస్తాడు. ఛాయాదేవి, సూర్య భగవానుల పుత్రుడైన శని, కుంభ, మకరరాశులకి అధిపతి. పడమలి వైపు ముఖాసీనుడై ఉంటాడు శనిదేవుడు.

వాహనం: కాకి
అదిదేవత : యముడు
ప్రత్యధిదేవత : ప్రజాపతి
వర్ణం : నలుపు
ధాన్యం : నల్ల నువ్వులు
పుష్పం : నల్లని తామర
వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం