ఏంటి రేపు ఎందుకు పనులు చేయొద్దు..ఏంటి ప్రత్యేకత అని అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. రేపు శని త్రయోదశి (Shani Trayodashi 2024) . శని త్రయోదశి అనేది శనిదేవుని పూజకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు. ఈ సందర్బంగా రేపు శనిదేవుని ఆరాధించడం ద్వారా శని గ్రహం ప్రభావం తగ్గుతుందని పండితులు సూచిస్తున్నారు. శని గ్రహం దోషాల నుండి విముక్తి పొందటానికి, శుభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శనిదేవుని అనుగ్రహం కోరుతూ ఈ రోజున పాటించాల్సిన నియమాలు మరియు నివారించాల్సిన పనులను పాటించడం చాలా అవసరం.
శని త్రయోదశి (Shani Trayodashi) ప్రత్యేకత :
ఈ రోజు శనిదేవుని ప్రత్యేక ఆరాధన చేయడం ద్వారా, జాతకంలో శని గ్రహం వల్ల కలిగే దోషాలు తగ్గుతాయని అనేక మంది నమ్మకం. శనిదేవుని పూజకు తైలాభిషేకం, నల్ల పుష్పాలు సమర్పించడం వంటి విశిష్ట పూజాకార్యక్రమాలు శుభప్రదంగా భావించబడతాయి. ఈ రోజున శుభకార్యాలు చేయకపోవడం మేలు అంటారు.
శనిదేవుని అనుగ్రహం కోసం :
శని త్రయోదశి రోజున పాటించాల్సిన నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా, శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. శని దోషాల వల్ల కలిగే అడ్డంకులు తొలగి, జీవితంలో శాంతి, సంపదలు వెల్లివిరుస్తాయని నమ్మకం. ఈ రోజు శనిదేవుని స్మరణతో గడిపి, శ్రద్ధతో పూజలు చేస్తే శుభఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు.
చేయకూడని పనులు :
శని త్రయోదశి రోజున కొన్ని పనులు చేయకూడదు. అబద్ధాలు చెప్పడం, ఇతరులను అవమానించడం, కోపం తెచ్చుకోవడం వంటి వాటిని పూర్తిగా దూరంగా ఉంచాలి. ఇనుముతో కూడిన వస్తువులు దానం చేయడం, పాదాలతో ఎవరినైనా తాకడం వంటి చర్యలు శనిదేవుని కోపానికి కారణమవుతాయని నమ్ముతారు. అంతేకాకుండా, మాంసం తినడం, మద్యం సేవించడం వంటి దోషకారకమైన పనులను ఈ రోజున పూర్తిగా మానుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
చేయాల్సిన పనులు :
శనిదేవుని అనుగ్రహం పొందేందుకు ఈ రోజున నల్ల నువ్వులు, నలుపు దుస్తులు దానం చేయడం మేలు చేస్తుందని చెబుతారు. పేదలకు ఆహారం దానం చేయడం, శనిచాలీసా పఠనం చేయడం ద్వారా శనిదేవుని కృప అందుకుంటారని నమ్మకం. శనిదేవుని ఆలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగించడం, శనిదేవుని మంత్రాలు జపించడం శుభప్రదమని చెపుతున్నారు.
Read Also : Manmohan Singh : విమానంలో మన్మోహన్ ప్రెస్ మీట్..ఇది కదా స్టైల్ అంటే..!!