Shani Trayodashi 2023 : త్రయోదశి శనివారం వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం అనేది శ్రీ మహావిష్ణువుకు, పరమేశ్వరునికి ఇష్టమైన రోజు. సూర్య భగవానుడి కుమారుడు శనిదేవుడు జన్మించిన తిథి కూడా త్రయోదశి.. అందుకనే శని త్రయోదశికి(Shani Trayodashi 2023) అంతటి విశిష్టత ఉంటుంది. శనిదేవుడు మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. శని త్రయోదశి రోజున మకర, కుంభ, మీన రాశుల జాతకులు.. కర్కాటక, వృశ్చిక రాశుల జాతకులు శనికి తైలాభిషేకం చేయించుకొని దశరథ ప్రోక్త శని స్తోత్రములను పఠిస్తే ఏలినాటి శని, అర్జాష్టమ శని, అష్టమ శని వంటి దోషాలు తగ్గుతాయి.
Also read : Hyderabad Metro: విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో.. ఇందుకోసం కొత్త స్మార్ట్ కార్డు
శని త్రయోదశి నాడు ఇలా చేయాలి..
- జాతకంలో శని దోషం ఉన్న వారు శని త్రయోదశి నాడు సూర్యోదయాని కంటే ముందుగానే నిద్ర లేచి తల స్నానం చేసి దగ్గర్లో ఉన్న శని దేవుడు ఉండే ఆలయానికి వెళ్లాలి.
- శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లటి వస్త్రం శనిదేవునికి ధరింపచేసి, నవధాన్యాలు, పూలు, పండ్లు సమర్పించాలి.
- నల్లని నువ్వులు, నల్లటి వస్త్రాన్ని దానం చేయాలి.
- శనివారం నాడు శ్రీమహాలక్ష్మీ, నారాయణుడు అశ్వత్థవృక్షంపై ఉంటారని నమ్ముతారు. కాబట్టి ఆ రోజున అశ్వత్థ వృక్షాన్ని సందర్శించుకుని దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి.
- శని త్రయోదశి నాడు ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందని పండితులు అంటుంటారు.
- నల్లని చీమలకు చక్కెర పెడితే మంచి ఫలితాలు కల్గుతాయి.
- రావిచెట్టు కింద దీపం పెట్టాలి..
ఉద్యోగం.. వివాహాలు.. వృత్తి.. వ్యాపారాలు..
శని ప్రభావంతో ఉద్యోగం ఆలస్యం అయ్యేవారు, వివాహాలు ఆలస్యమయ్యేవారు, వృత్తి వ్యాపారాల్లో కలిసి రానివారు శనికి పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ శని పూజలు శని త్రయోదశి రోజు చేస్తే ఎక్కువ ఫలితాన్నిస్తాయని నమ్ముతారు.
గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.