Site icon HashtagU Telugu

Shani Dev: శని దేవుడికి ఈ ఒక్క వస్తువు సమర్పిస్తే చాలు.. శని పీడ తొలగిపోవడం ఖాయం!

Shani Dev

Shani Dev

మామూలుగా శని దేవుడు కర్మ ఫలితాలను బట్టి శుభ, అశుభ ఫలితాలను అందిస్తాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. దీన్ని అనుసరించి వ్యక్తి జీవితంలో సుఖాలు, దుఃఖాలు ఉంటాయి. అయితే, శని దశలో మంచి రోజులు కూడా వస్తాయి. శని సాడేసతి, దైయతో బాధపడతారు. చెడు పనులు చేసే వారికి కష్టాలు మంచి పనులు చేసే వారికి ఆనందాన్ని అందిస్తాడు శని దేవుడు. అయితే అలాంటి శని దేవునికి సంబంధించిన శని పీడ తొలగిపోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రతి శనివారం శని దేవుడిని ఆరాధించాలట. మీ దగ్గర్లో ఉన్న నవగ్రహాల వద్దకు వెళ్లి నల్ల నువ్వులు సమర్పించాలనీ చెబుతున్నారు. ఇవి శని భగవాణుడికి ఎంతో ప్రీతికరం. కాబట్టి వీటిని శనదేవుడికి సమర్పిస్తే శనీశ్వరుడు సంతోషిస్తాడట. అలాగే శనిదేవుడికి రాళ్ల ఉప్పు కూడా సమర్పిస్తారు. శని విగ్రహాం ముందు ఇవి సమర్పించాలి. ఏవైనా నీలం రంగు పుష్పాలను కూడా శనిదేవుడికి సమర్పించాలి. దీంతో శనిదేవుడు అనుగ్రహిస్తాడట.

అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేసినా శని దేవుడు కటాక్షిస్తాడట. వాటితో మూగ జీవాలకు ఆహారం ఇవ్వాలి. పేదలకు ముఖ్యంగా వయస్సులో పెద్దవారికి ఆహారం ఇవ్వాలని,ఇలా చేయడం వల్ల శని బాధల నుంచి త్వరగా విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.