Site icon HashtagU Telugu

Zodiac Signs: 5 రాశుల వాళ్ళూ.. అక్టోబర్ 17 వరకు బీ అలర్ట్

Shani Gochar 2025

Shani Gochar 2025

Zodiac Signs: ఆ ఐదు రాశుల వాళ్ళు బీ అలర్ట్. అక్టోబర్ 17 వరకు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఏమిటా రాశులు ? వాళ్ళకు ఉన్న గండం ఏమిటి ? అనేది తెలుసుకోవాలంటే ఈ కథనం మొత్తం చదవాల్సిందే..

జ్యోతిష్య శాస్త్రంలో శని, రాహువు కూటమి అత్యంత ప్రమాదకరమైనది. ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో ఉంది. మార్చి 15న శని, రాహువు కూటమి కలిసి శతభిషా
నక్షత్రంలోకి ప్రవేశించింది. శని గ్రహాన్ని కర్మ దేవుడిగా పరిగణిస్తారు. రాహువును శతభిషా నక్షత్రానికి అధిపతిగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో శతభిషా నక్షత్రంలోకి శని రాక కారణంగా అక్టోబర్ 17వ తేదీ వరకు శని-రాహువు కూటమి కొనసాగుతుంది. అందుకే అప్పటివరకు 5 రాశుల వాళ్ళు చాలా చాలా కేర్ తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువు లేదా శని యొక్క చెడు కన్ను ఒకరిపై పడితే, ఆ వ్యక్తి జీవితం మొత్తం దుఃఖంతో నిండిపోతుంది. రాహువు లేదా శని వచ్చి జాతకంలో కూర్చుంటే కోటీశ్వరుడు కూడా దరిద్రుడిగా మారిపోతాడనే నమ్మకాలు ఉన్నాయి. అయితే, వారు సంతోషంగా ఉంటే వారి ఆశీస్సులు కూడా ఫలిస్తాయి. శని మరియు రాహువుల కలయికతో ఏ రాశుల వారు అలర్ట్ గా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కర్కాటక రాశి

శని-రాహువు గ్రహాల కలయిక కర్కాటక రాశి వారికి ప్రమాదకరం. అక్టోబర్ 17వ తేదీ వరకు ఈ రాశి వాళ్ళను శని గ్రహం పట్టి పీడించే అవకాశం ఉంది. ఈ చెడు ప్రభావం కారణంగా ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఎదుర్కోవలసి రావచ్చు. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే గండం ఉంటుంది. దీని కారణంగా మీ బడ్జెట్ అంచనాలు తప్పొచ్చు. వ్యాపారం కోసం మీరు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ రాశి వారు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కోవలసి రావచ్చు. ఈ సమయంలో శత్రువులు మీకు హాని కలిగించే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మీరు కొత్త పెట్టుబడి ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఒకవేళ అలా చేయకుంటే నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.

2. కన్యా రాశి

కన్యా రాశి వారు శని-రాహువు గ్రహాల కలయిక వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా కష్టపడాల్సి రావచ్చు. కన్యా రాశి వారికి రుణభారం చాలా పెరుగుతుంది. మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కోవలసి రావచ్చు. అన్ని నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు మీపై విశ్వాసం తగ్గవచ్చు. కుటుంబంతో విభేదాలు కూడా రావచ్చు.

3. వృశ్చికం

శని-రాహువుల కలయిక వల్ల వృశ్చిక రాశి వారికి పూర్వీకుల ఆస్తికి సంబంధించి సమస్యలు తలెత్తే గండం ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల మీరు ప్రత్యెక శ్రద్ధ వహించాలి. తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించే వారు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు కూడా బాగా పెరగవచ్చు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి నుంచి విడిపోయే అవకాశం
ఉంది. ఎవరితోనూ వివాదానికి దిగవద్దు. లేకపోతే మీరు గౌరవం కోల్పోవచ్చు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున.. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి.

4. కుంభం

శని-రాహువుల కలయిక వల్ల కుంభరాశి వారు అక్టోబర్ 17 వరకు జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవలసి రావచ్చు. ఈ సమయంలో మీలోకి అహాన్ని రానివ్వకండి. ఈ సమయంలో మీ ప్రియమైనవారి మద్దతు మీకు లభించదు. ఆరోగ్య సమస్యలు తలెత్తి వాటి చికిత్సల కోసం మీ ఖర్చులు పెరగవచ్చు. వైవాహిక జీవితంలో భాగస్వామితో మీకు
విభేదాలు రావచ్చు.

5. మీనం

మీన రాశి వారికి శని పీడ మొదటి దశ ప్రారంభమైంది. మీన రాశి వారు అక్టోబర్ 17 వరకు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదం రావచ్చు. ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. మీకు కాళ్ళ నొప్పి రావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.