Site icon HashtagU Telugu

Shani Remedies: శనిదోషంతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?

Shani Remedies

Shani Remedies

శనిశ్వరుడిని న్యాయ దేవుడిగా పిలుస్తారు. అంటే మనం చేసే పనులను బట్టి శుభ, అశుభ ఫలితాలను ఇస్తాడని నమ్ముతూ ఉంటారు. అందుకే ఎప్పుడూ కూడా మంచి పనులే చేయాలని పండితులు చెబుతుంటారు. చెడు పనులు చేసే వారికి చెడ్డ ఫలితాలే ఇస్తాడని వారిని కష్టాలకు గురి చేస్తాడని చెబుతూ ఉంటారు. శని దోషంతో కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు కొన్ని రకాల నియమాలను పాటించాలని చెబుతున్నారు. ఇందుకోసం శనివారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటించాల్సిందే అంటున్నారు పండితులు.

శనివారం ఉదయం నిద్ర లేచి స్నానం చేసి శని దేవుడికి తైలాభిషేకం చేయించాలట. అలాగే నల్ల నువ్వులు, తామర వత్తులతో కలిపి దీపారాధన చేయాలట. అలాగే నల్లని బట్టని కూడా శనీశ్వరుడికి సమర్పించాలని చెబుతున్నారు. ముఖ్యంగా శనిదేవుడిని హనుమంతుడు, వెంకటేశ్వర స్వామి, శంకరుడు ఎంతో ఇష్టమైన దేవుళ్లని చెబుతుంటారు. అందుకు ఈ రోజున వారికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఆయా దేవుళ్ల ఆలయాలకు వెళ్లిన కూడా శనిదేవుడు మనకు మంచిఫలితాలు ఇస్తాడట. అదేవిధంగా శనివారం రోజున రావిచెట్టు అడుగు భాగాన నీడలో దీపం పెట్టాలట. అలాగే నల్ల చీమలకు చక్కెర, బెల్లంలను ఆహరంగా పెట్టాలట.

కాకులకు,కుక్కలకు ఆహరం పెట్టాలని చెబుతున్నారు. శనివారం రోజుల పేదలకు స్వీట్లను, వస్త్రాలను దానంగా ఇవ్వాలని చెబుతున్నారు. శనివారం రోజు కొన్ని రకాల వస్తువులు ఇంట్లోకి తీసుకు రాకూడదట. ముఖ్యంగా ఉప్పు, కారం,ఇనుము వంటి వస్తువులు అసలు కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు. అలాగే నువ్వుల నూనె నల్లని బట్టలు కూడా కొనుగోలు చేయకూడదట. చెప్పులు బూట్లు వంటివి కూడా కొనుగోలు చేయవద్దని చెబుతున్నారు. శనివారం రోజున లవంగాలు, కర్పూరంలో కొన్ని పరిహరాలు పాటించాలి. కర్పూరంను ఇంట్లో వెలిగించి దానితో దిష్టిని తీసేయాలి. లవంగాలను తీసుకుని ఇంటి చుట్టు తిప్పి, వాటిని పారే నీళ్లలో వదిలేయాలి. ఇలా చేస్తే అతి కొద్దిరోజుల్లో శనిప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని చెబుతున్నారు పండితులు.