Site icon HashtagU Telugu

Shani Jayanthi: అప్పులు తీరిపోయి సంతోషంగా ఉండాలంటే శని జయంతి రోజు ఇలా చేయాల్సిందే!

Shani Jayanthi

Shani Jayanthi

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సంపాదించినది చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని బాధపడుతున్నారు. అయితే ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం ఎన్నో పూజలు పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయినప్పటికి మంచి ఫలితాలు కనిపించవు. ప్రతీ ఏడాది వైశాఖ మాసంలోని అమావాస్య తిథి నాడు శని జయంతిని జరుపుకుంటూ ఉంటారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు శని జయంతి ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుందట. ఈ సందర్భంగా శని జయంతి రోజున ఏ పూజలు చేస్తే శని దోషం నుంచి తప్పించుకోవచ్చట.

మరి అప్పుల బాధల నుంచి ఉపశమనం పొందాలి అంటే శని జయంతి రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇకపోతే ఈ సారి శని జయంతి వేళ సుకర్మ, ధృతి యోగం, సర్వార్ధ సిద్ధి యోగాలు ఏర్పడనున్నాయట. ఈ ప్రత్యేక యోగాల వేళ శని దేవుని ఆశీస్సుల కోసం ఈ పనులు చేయాలట. శని జయంతి వేళ నల్లని వస్త్రాలను ధరించి పూజలు చేయాలని చెబుతున్నారు. కాగా శని జయంతి రోజున శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆవాల నూనె, నల్ల బట్టలు, ఇనుము వస్తువులు, గొడుగు వంటివి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయట. శని దేవుడికి ఉసిరికాయతో చేసిన లడ్డూలను నైవేద్యంగా పెట్టడం వల్ల శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అలాగే శని జయంతి వేళ పేదలకు, నిస్సహాయంగా ఉండే వారికి అన్నదానం చేయడం వల్ల శని దేవునికి ఆగ్రహం నుంచి తప్పించుకోవచ్చట.

ఇలా చేయడం వల్ల శని దోషం, సాడే సతి సమస్య నుంచి విముక్తిని పొందవచ్చు అని చెబుతున్నారు పండితులు. అలాగే శని జయంతి రోజున నిరు పేదలకు నల్లని వస్త్రాలను, నల్లని నువ్వులను దానం చేయాలట. శని గ్రహానికి సంబంధించిన సాడే సతి ప్రభావం తగ్గాలంటే ఆవ నూనె, నల్ల బూట్లు, ఇనుప పాత్రలు వంటివి దానం చేయాలట. శని జయంతి రోజున పొరపాటున కూడా ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయకూడదట. శని జయంతి వేళ ఒక కంచు గిన్నె పాత్రను తీసుకొని, అందులో ఆవాల నూనె పోసి, అందులో నాణేన్ని వేసి, మీ ముఖాన్ని చూసి ఆ నూనెను ఎవరైనా అడిగితే ఇవ్వండి లేదా గిన్నెతో పాటు ఆలయంలోనే ఉంచాలని చెబుతున్నారు. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందడానికి శని జయంతి రోజున చెట్టుకు ఇనుప మేకులు సమర్పించాలట. ఇలా చేయడం వల్ల అప్పుల బాధలు తగ్గిపోతాయని చెబుతున్నారు. అలాగే శని జయంతి రోజు శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం. శ్మశాన వాటికలో శవాన్ని కాల్చేందుకు కట్టెలను దానం చేయవచ్చట. ​శని జయంతి రోజున సాయంకాలం సమయంలో రావి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగించాలని చెబుతున్నారు. అలాగే శని జయంతి రోజున హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించాలట. ఇలా చేయడం వల్ల శని దేవుని అశుభ ఫలితాల నుంచి విముక్తి పొందవచ్చట. కోతులకు అరటిపండు బెల్లం తినిపించాలట. ఈ విధంగా చేయడం వల్ల అరుణ బాధల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.