Site icon HashtagU Telugu

Shani Jayanthi: శని జయంతి రోజు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.. చేసారో అంతే సంగతులు!

Shani Jayanthi

Shani Jayanthi

హిందూ మతం ప్రకారం శని దేవుడిని న్యాయ దేవుడిగా పరిగణిస్తారు. అంటే మనం చేసే మంచి చెడు పనులను బట్టి శుభ అశుభ ఫలితాలను ఇస్తాడు. అయితే శని దేవుడి ఆశీస్సులు ఎవరి మీద అయితే ఉంటాయో వారి జీవితం ఆనందం, శ్రేయస్సుతో నిండి ఉంటుందట. శని దేవుడికి కోపం వస్తే ఎంతటి కోటీశ్వరుడు అయినా సరే బీద వారు అవ్వాల్సిందే. అందుకే చాలా మంది శని దేవుడిని పూజించాలి అన్న, గుడికి వెళ్ళాలి అన్న భయపడుతూ ఉంటారు. ఇకపోతే హిందువులు ప్రతి ఏడాది శని జయంతి వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు.

అలాగే ఈ రోజున ఆయనను ప్రత్యేకంగా పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఈ రోజున చేసేటటువంటి పనులు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయని భక్తులను నమ్మకం. ఇకపోతే ఈ శనీశ్వరుడు జయంతి రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతీ ఏడాది వైశాఖ మాసంలోని అమావాస్య తిధి మే 26న మధ్యాహ్నం 12:11 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ తిధి మర్నాడు అంటే మే 27న రాత్రి 8:31 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో శని జయంతిని మే 27వ తేదీ మంగళవారం జరుపుకుంటారు.

ఇకపోతే ఈరోజున ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. శని జయంతి రోజు ఎవరిని అవమానించకూడదట. శని దేవుడు న్యాయాధిపతి కాబట్టి ఆయనకు అన్యాయం అసలు ఇష్టం ఉండదట. శని జయంతి రోజున పొరపాటున కూడా పేదవారిని బలహీనమైన వారిని అవమానించడం హేళన చేయడం వంటివి అసలు చేయకూడదట. ఇలా చేస్తే శనీశ్వరుడికి కోపం వస్తుందట. కాబట్టి ఈరోజు మీకు వీలైనంతవరకు ఇతరులకు సహాయం చేయడం మంచిదని చెబుతున్నారు. శని జయంతి రోజు మాంసాహారాన్ని తీసుకోవడం అంత మంచిది కాదు. మద్యం మాంసం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఈరోజు గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం వంటివి అసలు చేయకూడదు. ఈరోజు నాకు ఒకవేళ మీరు నూనె దానం చేయాలి అనుకుంటే నువ్వులు నేను దానం చేయడం మంచిది. చెడిపోయిన ఇంట్లో వేస్ట్ గా పడి ఉన్న నూనె వంటివి అసలు దానం చేయకూడదు. శుభ్రమైన స్వచ్ఛమైన నూనెను మాత్రమే దానం చేయాలి. కాబట్టి పైన చెప్పిన తప్పులు చేయకుండా ఉంటే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.