Shani Dev: శని మిమ్మల్ని బాధించినప్పుడు ఎలా విముక్తి పొందాలో తెలుసా?

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు అన్నది సర్వసాధారణం. ప్రతి ఒక మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో

  • Written By:
  • Publish Date - March 10, 2023 / 06:00 AM IST

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు అన్నది సర్వసాధారణం. ప్రతి ఒక మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో దురదృష్టం అనేది వెంటాడుతూ ఉంటుంది. అందుకు గల ముఖ్య కారణం శని దోషం అని చెప్పవచ్చు. కాగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో శని దేవుడు అశుభ స్థానంలో ఉంటే దురదృష్టం వెంటాడుతుంది. అందుకే శని దేవుడి దయ లేకపోతే జీవితంలో విజయం సాదించలేడు.. శని దేవుడు చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తాడు. శని దేవుడు ఒక్కసారి ఇబ్బందులను కష్టాలను కలిగించాడు అంటే అంతకు రెండింతల ఐశ్వర్యాన్ని డబ్బును ప్రసాదిస్తాడని అర్థం. అందుకే చాలామంది శనీశ్వరుని ఆలయానికి వెళ్లి శని అనుగ్రహం కోరుకుంటూ ఉంటారు.

శనీశ్వరునికి కోపం ఎక్కువ. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళని శిక్షించడం లేదా కష్టాలు పెట్టడం లాంటివి చేస్తుంటాడు. శని దేవుడి స్వభావం చాలా కోపంగా ఉంటుంది. శని నలుపు రంగులోనే ఉంటాడు. శనికి ఇష్టమైన రంగు కూడా నలుపే. అందుకే శనికి నలుపు రంగులో ఉండే వస్తువులనే సమర్పిస్తారు. అయితే జన్మరాశి నుండి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీని వల్ల ఉద్యోగులకు కోర్టు కేసులు, రాజకీయంగా అపవాదులు, ఆకస్మిక బదిలీలు, విభేదాలు వంటివి వస్తాయి. అలాగే జాతక చక్రంలో శని మంచి స్థితిలో ఉంటే, గోచరం లో గురు బలం ఉన్నప్పుడు శని అంతగా బాధించడు. అటువంటి దోషాలు ఉన్నప్పుడు మీరు శనికి జపాదులు, తైలాభిషేకం చేయించుకుంటే మంచిది. అదేవిధంగా జన్మరాశి నుండి నాలుగవ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు.