Site icon HashtagU Telugu

Shani Dosham: మీరు ఏ పని చేసినా కూడా కలిసి రావడం లేదా.. ఇలా చేయండి?

Mixcollage 15 Mar 2024 07 00 Pm 9762

Mixcollage 15 Mar 2024 07 00 Pm 9762

మామూలుగా కొందరు ఎలాంటి పని మొదలుపెట్టినా కూడా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. ఎన్ని పూజలు వ్రతాలు చేసినప్పటికీ పనులలో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. కొందరినీ బాధలు జీవితాంతం వెంటాడుతుంటాయి. అలాంటి వారు ఏం పని చేసినా కలిసిరాదు. ఇలాంటి వారికి శని దోషం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందరి దృష్టిలో శని అంటే ఎన్నో ఇబ్బందులకు గురి చేసే వాడని, ఒక్కసారి శని ఆవహిస్తే దాదాపు ఏడు సంవత్సరాల పాటు తొలగిపోదని అందరూ భావిస్తుంటారు.

ప్రీతికరమైన పనులు ఎవరికైనా తాను చేసిన తప్పుల వల్ల కర్మ ఫలితాలను అనుభవింప చేసేవాడే శని అని జ్యోతిష్యులు చెబుతున్నారు. మనిషిపై శని ప్రభావం తగ్గాలంటే తప్పకుండా శనీశ్వరుని పూజించాలట. శనీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన పనులు చేయడం వల్ల శని ప్రభావం నుంచి తొందరగా బయటపడవచ్చట. శనీశ్వరుని అనుగ్రహం కలిగితే పూర్తిస్థాయిలో శని ప్రభావం తొలగిపోతుందట. శివలింగం పూజ అందుకే శని దేవునికి ఎంతో ప్రీతికరమైన వాటిలో శివలింగం పూజ ఒకటీ. శని దేవుడిని ఈశ్వరుని అంశంగా భావించి శనీశ్వరుడుగా పూజలందుకుంటున్నాడని జ్యోతిష్యులు చెబుతున్నారు.

శనికి ఎంతో ఇష్టమైన శివలింగం అభిషేకం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని పండితులు పేర్కొంటున్నారు. శని ప్రభావంతో బాధపడే వారు నిత్యం శివలింగానికి అభిషేకం చేయడం మంచిది. శనివారం రోజు శనివారం రోజు శివాలయంలో ప్రసాదాలు పంచటం, ప్రతిరోజు నల్లని నువ్వులు కలిపి అన్నం కాకులకు పెట్టడం వల్ల శని ప్రభావం నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా శనివారం హనుమంతుడిని, శ్రీవారికి దర్శించడం, సుందరకాండ చదవడం వంటి వాటి ద్వారా శని ప్రభావం నుంచి తొందరగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. శనివారం శనీశ్వరునికి పూజలు నిర్వహించేటప్పుడు నల్లని దుస్తులను ధరించి, శనీశ్వరునికి నీలం రంగు పుష్పాలతో పూజ చేయటం మంచిది.