మన జీవితంలో జరిగే కొన్ని రకాల సంఘటనలు జాతకంలో ఉన్న గ్రహాల స్థానాల ఆధారంగా జరుగుతాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. జాతకంలోని గ్రహాల స్థానాలు మారడం వల్ల జీవితంపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు రెండు ఉంటాయట. ఇకపోతే శనీశ్వరుడిని న్యాయ దేవుడిగా పిలుస్తారు అన్న విషయం మనందరికి తెలిసిందే. శనీశ్వరుడు మనుషులకు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అయితే జన్మ కుండలిలోని శనిదోషం ఉంటే ముఖ్యమైన పనిలో అడ్డంకులు సృష్టిస్తుంటే చేపట్టిన పనులకు తగిన ఫలితం పొందకపోతే జీవితంలో ఏలి నాటి శని లేదా శనితో ఇబ్బంది పడే అవకాశం ఉందట.
అలాంటప్పుడు అన్ని మంచి పనులు చేస్తూ ఉండాలట. అయితే శని పూజించడం వల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయట. దీనితో పాటు జీవితంలో సానుకూల శక్తిని సృష్టిస్తుందట. పనిలో పురోగతి సాధించడానికి సహాయపడుతుందట. అలాగే ఎవరి జాతకంలో అయితే శనీశ్వరుడిని ఏలి నాటి దశ జరుగుతున్నా శని స్థానం కారణంగా బాధపడుతున్నా ఖచ్చితంగా కొన్ని ప్రత్యేక నివారణలను ప్రయత్నించాలట. ఈ చర్యలన్నీ తీసుకోవడం వల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలను అధిగమించడానికి, మీ జీవితంలో పురోగతి సాధించడానికి కూడా మీకు సహాయపడుతుందని చెబుతున్నారు.
శని అనుగ్రహం కోసం శని వారం రోజు శనిశ్వరుడుని పూజించి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలట. అలాగే శనివారం శనికి ఇష్టమైన ఇనుప వస్తువులు, నల్ల బట్టలు వంటివి దానం చేయాలట. అలాగే “ఓం శం శనిశ్చరాయ నమః” అనే శని మంత్రాన్ని తప్పకుండా జపించాలని చెబుతున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా పేదలకు సేవ చేయాలట. నల్ల బూట్లు, చెప్పులు, దుప్పట్లు దానం చేయాలనీ చెబుతున్నారు. శనివారం నాడు నల్ల నువ్వులు, ఇనుము, మినపప్పు, నూనె దానం చేయాల. శని అనుగ్రహం కోసం జీవితంలో చెడు సహవాసానికి దూరంగా ఉండాలని జీవితాంతం దేవుడిని ఆరాధించడం, దానధర్మాలు చేయడం కొనసాగించాలని చెబుతున్నారు.