అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని అంటూ ఉంటారు. అంటే మనకు ఉన్నంతలో లేని వారికి దానం చేస్తే ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయని చెబుతుంటారు. పేద వాళ్ళకి అవసరమైన వాళ్లకి దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని చెబుతుంటారు. అయితే ప్రతి ఒక్కరూ అన్నదానం చేయలేరు కాబట్టి ఎవరికి తోచిన విధంగా వారు దానాలు చేయవచ్చు అని చెబుతున్నారు. చాలామంది చీమలకు ఆహారం ఇస్తే శని దేవునికి సంబంధించిన బాధలు ఉండవని అంటుంటారు. మరి ఇందులో నిజానిజాల విషయానికొస్తే..
బియ్యం పిండిలో చక్కెర లేదా బెల్లం కలిపి చీమలకు పెట్టాలట. లేదా చక్కెర అయినా పెట్టవచ్చు. ఇలా చేస్తే పదివేల మందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుందట. అయితే ఇది ఇళ్ళల్లో, మనుషులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో కాకుండా దూరంగా, చీమలు ఉండే ప్రదేశంలో పెట్టాలని చెబుతున్నారు. కొందరు చక్కెరను చీమల కోసం చెట్టు మొదల్లలో చల్లుతూ ఉంటారు. ఇలా చేస్తే చాలా మంచిదని చెబుతున్నారు. తేనెను తమలపాకులోగానీ రావి ఆకులోగానీ పెట్టి సూర్యుడికి, తులసికి పూజ చేసి నైవేద్యం పెట్టి అక్కడే వదిలెయ్యవచ్చట. ఇలా చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే తేనె ఎన్నో పువ్వుల నుండి సేకరించబడుతుంది. అమృత తుల్యమైంది.
దాన్ని చీమలకి పెడితే చాలా దోషాలు పరిహారమవుతాయట. అలా అని కేవలం చీమలకు చక్కర మాత్రమే వేయకుండా మీకు ఒకరికి పెట్టే స్తోమత ఉంటే తప్పకుండా ఒకరికి పెట్టాలని అది మీకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. శక్తి లేని వాళ్ళు ఏమి దానం చేసినా అమిత ఫలాన్నిస్తుంది కానీ, అన్నీ వుండి, దానం చేసే శక్తి కలవారు తమ శక్తికొద్దీ దానం చెయ్యాలి. అంతేకానీ చీమలకి చక్కెర వేస్తే పదివేలమందికి దానం చేసిన పుణ్యం వస్తుందని అత్యాశతో అలా చెయ్యకూడదట.