Site icon HashtagU Telugu

Stay Away From These Habits : ఈ 6 అలవాట్లు అంటే శని దేవుడికి కోపం.. వీటికి దూరంగా ఉండండి

Shani Dev

Shani Dev

న్యాయ దేవుడు శని.. తొమ్మిది గ్రహాలలోకెల్లా అత్యంత కీలకమైన వాడు.  ఒక్కసారి శని చెడిపోతే.. మనిషి జీవితమంతా దుఃఖంతో నిండిపోతుంది. జనవరి 31న కుంభరాశిలో శని దేవుడు అస్తమించబోతున్నాడు. ఈనేపథ్యంలో శని దేవుడికి కోపం తెప్పించే పనులకు , అలవాట్లకు దూరంగా ఉండటం బెస్ట్. కొన్ని చెడు అలవాట్లు ఉన్నవారిని శని ఇష్టపడడు. అలాంటి వారిపై శని నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తాడు. కాబట్టి 6 రకాల అలవాట్లు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* పాదాలను నేలకు రాస్తూ నడవొద్దు

జ్యోతిష్యుల ప్రకారం.. మీ పాదాలను నేలకు రాస్తూ నడవొద్దు. ఇది చాలా చెడ్డ అలవాటు. శని ఇలాంటి వారిని ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంది.  అశుభ ఫలితాలు వచ్చేలా చేస్తుంది. వారు చేసిన పనులు చెడిపోవచ్చు. ఆర్థిక కష్టాలు ఎల్లప్పుడూ కొనసాగుతాయి.

* కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం

ఇంట్లో లేదా ఆఫీసులో కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతున్న వారిని మీరు చాలాసార్లు చూసి ఉంటారు. ఇలా చేయడం ఎంత అశుభమో తెలుసా? ఇది బలహీన చంద్రుడిని సూచించడమే కాకుండా.. శని సమస్యలను కూడా చూపుతుంది. ఇలా చేసేవారు తరచూ మానసిక సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలాంటి వారిపై ఒత్తిడి చాలా ఎక్కువగా కనిపిస్తుంది.

* వడ్డీ మీద డబ్బు 

వడ్డీ మీద డబ్బుతో వ్యాపారం చేసే వారికి శని కూడా ఇబ్బందులను సృష్టిస్తుంది. మీరు వడ్డీ వ్యాపారం చేస్తే ఏదో ఒక రోజు శని దేవుడి వంక మీపై పడటం ఖాయం. వడ్డీతో డబ్బును నడిపేవారు శనిగ్రహంతో చాలా జాగ్రత్తగా ఉండాలి.

* ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయడం 

నడిచేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేసే వాళ్లను మీరు తరచుగా చూసి ఉంటారు. ఇది చాలా చెడ్డ మరియు అసహ్యకరమైన అలవాటు. ఈ చెడు అలవాటు జాతకంలో శని గ్రహం యొక్క బలహీనతకు సంకేతం. అలాంటి వారి జీవితం చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకే ఈ అలవాటును వీలైనంత త్వరగా వదిలేయడం మంచిది. లేకుంటే శనిగ్రహ ఆగ్రహానికి గురికావలసి రావచ్చు.

* బాత్రూమ్‌ను మురికిగా ఉంచడం 

స్నానం చేసిన తర్వాత బాత్రూమ్‌ను మురికిగా ఉంచడం వల్ల వాస్తు దోషాలు పెరగడమే కాకుండా, జాతకంలో చంద్రుడు కూడా అశుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడని చెబుతారు.  అలాంటి వారిపై శని ఎప్పుడూ కోపంగా ఉంటాడు. అందుకే తమ ఇంట్లోని టాయిలెట్ లేదా బాత్రూమ్ ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే మీ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

* పాత్రలు కడగకుండా వదిలివేయడం

భోజనం చేసిన తర్వాత పాత్ర కడగకుండా ఉంచడం వల్ల కూడా శని దృష్టి ప్రభావం పెరుగుతుంది.  అందుకే ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకండి. కిచెన్‌లో ఇలాంటి పాత్రలు ఉంచితే.. కష్టపడి పనిచేసినా సంతృప్తికరమైన ఫలితాలు రావు.  పాత్రలను సరైన స్థానంలో ఉంచడం వల్ల చంద్ర, శని దోషాలు తొలగిపోతాయని చెబుతారు.