Site icon HashtagU Telugu

Shani Dev: కార్తీకమాసంలో శనివారం ఈ ఒక్క పని చేస్తే చాలు.. శని అనుగ్రహం మీపైనే!

Shani Dev

Shani Dev

హిందూమతంలో కార్తీకమాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తీక మాసంలో చేసే పూజలు, పరిహారాలు ప్రత్యేక ఫలితాలను ఇస్తాయట. ఇకపోతే కార్తీక మాసంలో నదీ స్నానాలు చేసి కార్తీక దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అలాగే వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని కూడా పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా కార్తీకమాసంలో వచ్చే శనివారాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు.

చాలామందికి శనీశ్వరుడి పేరు వినగానే కొంచెం తప్పుడు అభిప్రాయం ఉంటుంది. ఆయన కష్టాలకు గురి చేస్తాడని, ఇబ్బందులు పెడతారని అనుకుంటూ ఉంటారు. కానీ పాపాలు, చెడ్డ పనులు చేసే వారికి మాత్రమే అలాంటి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మంచి పనులు చేసే వారికి ఎల్లప్పుడూ ఆ శనీశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట. శనీశ్వరుడు మనం చేసుకున్న కర్మలను బట్టి మాత్రమే ఫలితాలను ఇస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది. చెడు పనులు చేసతే అలాంటి ఫలితాలు కలుగుతాయి.

శనీశ్వరుడికి కొన్ని పరిహారాలు చేస్తే కష్టాల నుంచి బయటపడవచ్చట. ముఖ్యంగా శనీవారం రోజు శనీదేవుడికి ఎంతో ప్రీతీకరమైందని, ఈ రోజున నువ్వుల నూనెతో అభిషేకం చేసి,నల్లని వస్త్రం, నల్ల నువ్వులు శనీశ్వరుడికి సమర్పించాలని చెబుతున్నారు. అలాగే నల్ల నువ్వులతో అన్నంను వండి ఆ అన్నాన్ని శనీశ్వరుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని కాకులకు, శునకాలకు ఆహారంగా పెడితే శనీశ్వరుడు పొంగిపొతాడట.

అలాంటి వారి జోలికి అస్సలు పోడని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా శనీవారం రోజు ఇలా చేసే వారికి అఖండ సిరి సంపదలు, ధనధాన్యాలను కూడా వచ్చేలా శనీదేవుడు అనుగ్రహిస్తాడట. అందుకే శనీవారం రోజున ఈ పరిహారం తప్పకుండా ఆచరించాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజున రావి చెట్టు, మేడిచెట్టు దగ్గరకు వెళ్లి వాటి కింద ఉండే చీమలకు చక్కెర, బెల్లం, పాయసం వంటివి పెట్టాలట. ఇలా చేస్తే శనీశ్వరుడి ఆనంద పడతారట. కాబట్టి శనివారం రోజు తప్పకుండా ఈ పరిహారాలను పాటించి ఆ శనీశ్వరుడి అనుగ్రహం పొందండి.