Site icon HashtagU Telugu

Shani Dev: ఈ జప మంత్రాలు పాటిస్తే శనిశ్వరుడిని ప్రసన్నం చేసుకోవచ్చు!

shani

shani

చాలామంది శనీశ్వరుడు పేరు వినగానే భయపడుతూ ఉంటారు. శని దేవుడిని పూజించాలి అన్న శని దేవుని గుడికి వెళ్ళాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు కొంతమంది పూజా విధానంలో కానీ లేదంటే తెలియక చేసే కొన్ని పనుల వల్ల మనం శని దేవుని ఆగ్రహానికి కారణమవుతూ ఉంటాం. అయితే మరి శని దేవునికి సంబంధించిన సమస్యలు అంటే కండరాలు అలాగే మనసు గాయపడినప్పుడు అనారోగ్యం బారిన పడినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అదేవిధంగా శని దేవుని ప్రసన్నం చేసుకోవాలంటే ఎటువంటి మంత్రాలు జపించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శని దేవునికి సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు ప్రతిరోజు హనుమంతుడిని ఆరాధించాలి. సూర్య దేవుని కుమారులు అయినా శని, యముడు.. ఇద్దరు కూడా న్యాయాధిపతులే. యముడు మరణించిన తరువాత దండనలు విధిస్తే, శని దేవుడు మాత్రం జీవులు బతికుండగానే హింసించి నరకయాతనలకు గురిచేసి శిక్షిస్తూ ఉంటాడు.

అంతేకాకుండా చేసిన కర్మలకు పాపాలకు గుణపాఠం నేర్పించే విషయంలో శని దేవుడికి ఎవరు సాటి లేరు అని చెప్పవచ్చు. శని దేవుడు తన దృష్టి ఎవరి మీద అయితే పడుతుందో వారిని హింసించి నాన్న యాతనలకు గురిచేసి అత్యంత క్రూరంగా బాధలకు గురి చేస్తూ ఉంటాడు. అయితే అటువంటి సమయంలో హనుమాన్ చాలీసా ను చదవాలి. అదేవిధంగా శని దేవుని పూజించే సమయంలో వాల్మీకి రామాయణంలోని బాలకాండం 30వ అధ్యాయాన్ని ప్రతిరోజు చదవాలి.