Shani Dev: అమావాస్య రోజు ఇటువంటి పనులు చేస్తే శని దేవునికి కోపం వస్తుందట?

Shani Dev: చాలామంది శనీశ్వరుడి పేరు వినగానే భయపడుతూ ఉంటారు. ఇంకొందరు మాత్రం ఎటువంటి భయం లేకుండా శనీశ్వరునికి ఇష్టమైన విధంగా పూజలు చేస్తూ శనీశ్వరునికీ ఇష్టమైన వస్తువులను ఆహారాలను దానం చేస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - October 16, 2022 / 06:30 AM IST

Shani Dev: చాలామంది శనీశ్వరుడి పేరు వినగానే భయపడుతూ ఉంటారు. ఇంకొందరు మాత్రం ఎటువంటి భయం లేకుండా శనీశ్వరునికి ఇష్టమైన విధంగా పూజలు చేస్తూ శనీశ్వరునికీ ఇష్టమైన వస్తువులను ఆహారాలను దానం చేస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం శని దేవుడికి కోపం ఎక్కువ అని చెబుతూ ఉంటారు. శని దేవుడి అనుగ్రహం పొందిన వారు రాజభోగాలను అనుభవిస్తారని, అలాగే శని దేవుని ఆగ్రహానికి గురయ్యే వాళ్ళు అష్ట కష్టాలను అనుభవిస్తారని చెబుతూ ఉంటారు. అయితే కొందరు తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల శని దేవుని ఆగ్రహానికి కారకులు అవుతూ ఉంటారు.

రాత్రి పూట తొందరగా పడుకోకుండా అర్ధ రాత్రి వరకు మేల్కొని ఉండేవారన్నా..చాలా పొద్దుపోయిన తర్వాత నిద్రలేచేవారన్నా కూడా శని దేవుడికి చాలా కోపం. అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించని వారి పైన, ఇప్పుడు ఇతరుల సొమ్ము కోసం ఆశపడే వారిని ఆ శని దేవుడు ఆగ్రహిస్తాడు అని పురాణాల ప్రకారం చెబుతూ ఉంటారు. వీటితో పాటుగా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించే వారిపై కూడా శని దేవుడు ఆగ్రహాన్ని చూపిస్తూ ఉంటారు. ఇకపోతే అమావాస్య సమయంలో కొందరు తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల శని దేవుని ఆగ్రహానికి లోనవుతూ ఉంటారు.

అందులో భాగంగానే అమావాస్య రోజున మాంసం మద్యపానం తీసుకునే వారిపై శని దేవుడు ఆగ్రహాన్ని ప్రదర్శిస్తాడు. అంతేకాకుండా మన ఇంట్లో వాటర్ ట్యాంక్ ను పడమర దిక్కుగా ఉంచినా కూడా శని దేవుడు ఆగ్రహానికి గురి కావాల్సిందే అని చెప్పవచ్చు. అదేవిధంగా మన ఇంటి ముఖద్వారం పడమర దిక్కుగా ఉన్నా కూడా శని దేవుని ఆగ్రహానికి కారణం కావాల్సిందే. అలాగే ఇంట్లో పని చేసే పని వాళ్లపై పెత్తనం చెలాయించే యజమానులపై కూడా శని దేవుడు ఆగ్రహాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది.