Shani: ఏల్నాటి శని దోషం అంటే ఏమిటి.. ఈ పనులు చేస్తే మీకు అంత మంచిదే!

ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏలినాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం ప్రతి మనిషి జీవితంలో జాతకం ప్రకారం రెండు లేదా 3 సార్లు వుంటుంది.

  • Written By:
  • Updated On - May 6, 2023 / 02:28 PM IST

ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏలినాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం ప్రతి మనిషి జీవితంలో జాతకం ప్రకారం రెండు లేదా 3 సార్లు వుంటుంది. అయితే ఆ శని ప్రభావం ని ఎలా తగ్గించుకోవాలి?అందుకోసమే ఏం చేయాలి? అన్న విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. నవగ్రహాల్లో అత్యంత ప్రభావంతమైన గ్రహం శని గ్రహం. జాతకంలో పుష్యమి, అనూరాధ,ఉత్తరాభాద్ర శని సంబంధిత నక్షత్రాలు. ఈయన నవగ్రహాల్లో ఒకటైన సూర్యుడు పుత్రుడు. ఈయనకు నవ గ్రహాల్లో మిగతా గ్రహాలకు లేనటువంటి ప్రత్యేక స్థానం ఉంది. ఏల్నాటి శని అంటే జాతక చక్రంలో 12 రాశులుంటాయి. గోచారం ప్రకారం గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో ఆయా గ్రహాల శుభాశుభా ఫలితాలు వస్తు ఉంటాయి.

అయితే మన కర్మఫలాన్ని ఎలా అయితే తప్పించుకొలేమో అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం కూడా తప్పించుకోలేము. కానీ కొన్ని పూజా పద్ధతుల వలన శని ప్రభావం నుంచి కాస్త ఊరట కలిగించుకోవచ్చు. మాములుగా శనీశ్వరుడు 12వ స్థానంలో ప్రవేశిస్తే ఏల్నాటి శని ప్రారంభం శనిని అందరు మంద గమనుడు లేదా మందుడు అంటారు. శని ఒక్కో రాశిలో రెండున్నర ఏళ్లు ఉంటారు. ఇలా జాతకుడి 12 వ ఇంట, 1 ఇంట, 2వ ఇంట ఉండే వరకు ఏల్నాటి శని ప్రభావం ఉంటోంది. మొత్తంగా ఏడున్నర ఏళ్లు ఏల్నాటి శని ప్రభావం ప్రతి జాతకుని జీవితంలో ఉంటోంది. శని పాప గ్రహం. అందుకనే ఈ దశ ప్రారంభమైనపుడు కష్టాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా తులా, మకర, కుంభ రాశులకు ఏల్నాటి శని సమయంలో మంచి ఫలితాను ఇస్తాడు.

తులా రాశి శనికి ఉచ్చ స్థానం. మకర, కుంభ రాశులు శని స్వక్షేత్రాలు దీంతో ఆయా జాతకులకు మంచి ఫలితాలనే ఇస్తూ ఉంటాడు. అయితే ఏల్నాటి శని సమయంలో శని మంచి కూడా చేస్తాడు. శని మన రాశిలో ప్రవేశించిన సమయంలో ప్రాణ భయం, ధనం లేకపోవడం ఒక వేళ వచ్చినా మన దగ్గర ఉండక పోవడం వంటివి ఇందులో భాగం. కొన్ని సందర్భాల్లో వివాహాం, ఇంటి నిర్మాణంతో పాటు ఉద్యోగాలు వంటివి ఆయా జాతకులకు కలిసి వస్తుంటాయి. ఇకపోతే శనీశ్వర గ్రహ తీవ్రతను తగ్గించుకోవాలంటే..విష్ణు సహస్రనామం, రుద్ర నమక చమకాలు, ఆదియ హృదయంతో పాటు సుందరాకాండ పారాయణంతో పాటు హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకంతో పాటు శని స్తోత్రం, శని చాలీసా,శని అష్టోత్తర సహస్రనా స్త్రోత్రం చేస్తే శని గ్రహ ప్రభావ తీవ్రత తక్కువగా ఉంటుంది. అలాగే శనీశ్వర గ్రహ తీవ్రతను తగ్గించుకోవచ్చు. మరి ముఖ్యంగా ప్రతి శనివారం నవగ్రహ ఆలయంలో శని దేవుని ఆరాధించడం.. శనీశ్వరుడి ముందు నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించడంతో పాటు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం.. పక్షులకు ఆహారం వేయడం.. పక్షులకు వేళకు ఆహారం వేయడం.. పరమశివుడి పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ద్వారా శని ఆయా జాతకులకు శుభ ఫలితాలను ఇస్తాడు.