Shani dev: శని దేవుడు కలలో కనిపిస్తే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసా?

సాధారణంగా సందర్భానుసారంగా కొంతమంది తప్పులు చేస్తున్నావ్ ఆ పైవాడు చూస్తూ ఉంటాడు తప్పకుండా శిక్షిస్తాడు

  • Written By:
  • Publish Date - October 30, 2022 / 06:30 AM IST

సాధారణంగా సందర్భానుసారంగా కొంతమంది తప్పులు చేస్తున్నావ్ ఆ పైవాడు చూస్తూ ఉంటాడు తప్పకుండా శిక్షిస్తాడు అని అంటూ ఉంటారు. ఆ మాట నిజమే ఇలా అంటే శని దేవుడు ఎప్పుడు తప్పుడు పనులు చేసేవారిని అబద్ధాలు చెప్పేవారిని ఓ కంట కనిపెడుతూ ఉండడం మాత్రమే కాకుండా అటువంటి వారికి కష్టాలను కూడా కలిగిస్తూ ఉంటారు. అందుకే శని దేవుని న్యాయదేవుడు అని పిలుస్తూ ఉంటారు. అనగా మన కర్మలను బట్టి శని దేవుడు ఫలాలను ఇస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. అయితే మామూలుగా మనం పడుకున్నప్పుడు అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. ఒకవేళ మనకు కలలో శని దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కొన్నిసార్లు మనం నిద్రపోతున్నప్పుడు మనకు కలలో శని దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే దేవుడు ఆలయంలో ఉన్నట్టు కనిపిస్తే మరి కొందరికి రాబందుపై కూర్చున్నట్లు మరికొందరికి కాకిపై ఉన్నట్లు ఇలా రకరకాలుగా కనిపిస్తూ ఉంటాడు. మరి అలా కనిపించినప్పుడు అది దీనికి సంకేతం ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలలో శని దేవుడు రాబందుపై కూర్చున్నట్లుగా కనిపిస్తే అది ఆశుభానికి సంకేతంగా చెప్పవచ్చు. దానివల్ల ఆ వ్యక్తి జీవితంలో ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది. వారి చెడు వార్తలు కూడా వినాల్సి ఉంటుంది. అలాగే కలలో శని దేవుడు కాకి పై స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తే దానిని ఆశుభంగా పరిగణించాలి.

అలాంటి కలలు వస్తే అటువంటి వ్యక్తి జీవితంలో అశుభ ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం. అలాగే కలలో శని దేవుని పూజిస్తున్నట్లు కనిపిస్తే అది కూడా అసాధారణ ఫలితాలను ఇస్తుంది అని అంటుంటారు. అటువంటి వ్యక్తులు శుభ అలాగే అశుభ ఫలితాలను పొందుతారు. అటువంటి కలలు వచ్చినప్పుడు శని దేవునికి సంబంధించిన పరిహారాలను పాటించాలి. ఒకవేళ శని దేవుడు ఏనుగు పై కనిపిస్తే అది శుభప్రదంగా భావించాలి. అటువంటి వ్యక్తి జీవితంలో ఆనందం రాబోతోంది అని అర్థం. అలాగే అటువంటివారు వారి కెరియర్ లో పురోగతిని సాధించబోతున్నారు అని అర్థం. ఆ వ్యక్తి డబ్బులు పొందుతాడు అని అర్థం. అలాగే శని దేవుడు నెమలిపై కూర్చుని కలలో కనిపిస్తే అంతా మంచి జరుగుతుంది అని అర్థం. దానిని శుభసంకేతంగా చెప్పవచ్చు. అలాంటి వ్యక్తి రాబోయే రోజుల్లో మంచి మంచి విజయాలను సాధిస్తాడు.