నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహం శనిగ్రహం. శని దేవుడు సూర్యదేవుని కుమారుడు అన్న విషయం తెలిసిందే. యమధర్మరాజు సోదరుడు. శనీశ్వరుడి అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో జరిగే మార్పులను అస్సలు ఊహించలేరు. ఆయన అనుగ్రహం కలిగింది అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వడం ఖాయం. శనీశ్వరుడి దయవల్ల జీవితంలో ఎన్నో రకాల మార్పులు సంభవిస్తూ ఉంటాయి. శని దేవుడు కొంత మంచి యోగాన్ని కలుగజేస్తే మరి కొందరికి కష్టాలను కలుగజేస్తూ ఉంటాడు. మనం చేసే మంచి చెడు పనులను బట్టి శుభ అశుభ ఫలితాలను అందిస్తూ ఉంటాడు.
అయితే శనీ ఏలీనాటి, సాడేసాతి, అర్ధష్టమ మొదలైన విధానంలో శనీదేవుడు మనపై ప్రభావం చూపిస్తాడు. ఈ కాలంలో శనీదేవుడు ఆయా వ్యక్తులు చేసుకున్న కర్మలను అనుసరించి ఫలితాలను ఇస్తాడట. శనీదేవుడు జాతకంలో చెడు స్థానంలో ఉంటే జీవితంలో ఎలాంగి ఎదుగు బొదుగు ఉండదట. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంలా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి జీవితంలో అస్సలు ముందుకు పోవడమే ఉండదట. ఏమి పని చేసిన కూడా కలిసి రాదట. అలాగే ప్రతి ఒక్కరితో కూడా విభేదాలు ఏర్పడతాయి. మాట్లాడటానికి వచ్చేవాడు కూడా పోట్లాడిపోతాడట.
అదే విధంగా ఏ పని మొదలు పెట్టిన అది మధ్యలోనే ఆగిపోతుందట. డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు అయిపోతాయట. తరచుగా ఏదైన ప్రమాదాలు చోటు చేసుకుంటాయట. ఆరోగ్య సమస్యలు వస్తాయట. ఇలా పైన చెప్పిన సమస్యలతో సతమతమవుతున్న వారు శనివారం రోజు నువ్వుల నూనెతో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవాలట. నల్లని బట్టలు నవధాన్యాలు పండితులకు దానంగా ఇవ్వాలని ఆవులకు కుక్కలకు ఆహారం పెట్టాలని చెబుతున్నారు. పేదవారికి అన్నదానం వస్త్ర దానం వంటివి కూడా చేయాలని చెబుతున్నారు. ఇలాంటివి చేస్తే శనీదోషం పూర్తిగా పొతుందట. ఆయన అనుగ్రహం లభిస్తుందట.