Success: ఎంత కష్టపడినా సక్సెస్ కావడం లేదా.. అయితే ఈ పరిహారాలు పాటించి చూడండి?

సాధారణంగా చాలామంది ఎటువంటి పనులు మొదలుపెట్టినా కూడా అవి జరగకపోక మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి.

  • Written By:
  • Publish Date - November 26, 2022 / 06:00 AM IST

సాధారణంగా చాలామంది ఎటువంటి పనులు మొదలుపెట్టినా కూడా అవి జరగకపోక మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. దీంతో చాలామంది ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కలేదు అనే దిగులు చెందుతూ ఉంటారు. కొంతమంది మానసిక ప్రశాంతత లేకుండా ఒత్తిడికి కూడా లోనవుతూ ఉంటారు. అయితే అలా ఎంత కష్టపడినా ఫలితం రాలేదు దక్కలేదు అని బాధపడేవారు కొన్ని రకాల పరిహారాలను పాటించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి. మళ్ళీ ఎటువంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గోచార గ్రహ స్థితి బాగోలేనప్పుడు అలాగే అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నప్పుడు ప్రతిరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె లేదా ఆవనూనెతో దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు వీళ్ళలో పోసి నిదానంగా 11 ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే స్మరిస్తూ చేయడం వల్ల మీరు అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి. అలాగే మీకు వారంలో ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు గోమాతకు పూజించి కొంచం గడ్డి పెట్టి మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఎప్పుడైనా ఇంటి నుంచి ఏదైనా పనుల మీద వెళ్తున్నప్పుడు శుభకార్యాలకు వెళుతున్నప్పుడు శ్రీ గణేశాయ అనే మంత్రాన్ని జపించి బయటికి వెళ్లడం ద్వారా అనుకున్న పనులు జరుగుతాయి. అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు వ్యతిరేక దిశలో నాలుగు అడుగులు వెనక్కి వేసి ఆ తర్వాత గణపతి దగ్గర ప్రసాదంగా పెట్టిన బెల్లం ముక్కలు నోట్లో వేసుకొని బయటకు వెళ్లడం వల్ల మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి.

అలాగే నలుపు రంగు దారాన్ని కొనుగోలు చేసి మీ వయసుకు సమానమైన ముడులను దానిపై కట్టి అరటీ లేదా తులసి ఆకుల రసాన్ని ప్రతి ముడి పై వేసి ఆ తర్వాత పసుపు,సింధూరాన్ని నల్ల ధరానికి పూయాలి. అనంతరం ఆధారాన్ని కుడి చేతికి కిందగా ఉండే విధంగా ధరించి దారాన్ని 21 రోజులపాటు ధరించాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోయి మీరు అనుకున్న విధంగా విజయం సాధిస్తారు. మరి ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయపడాలి. పేదలకు బీదవారికి మీకు తోచిన విధంగా మీ స్తోమతకు తగ్గట్టుగా దానధర్మాలు చేయాలి. అలాగే పక్షులకు,పశువులకు, మూగ జంతువులకు హనీ చేయకపోయినా పర్లేదు కానీ వాటికి ఆహారాన్ని ధాన్యంగా వేయాలి. అలాగే ఎవరైనా నోరు తెరిచి ఆకలిగా ఉంది అని అన్నప్పుడు వారిపై కసురుకోకుండా వారిపై దయ చూపి వారికి కాస్త సహాయం చేయాలి. ఆకలి అన్న వారికి అన్నం పెట్టి వారి ఆకలిని తీర్చాలి.