Spirituality: మామూలుగా మనం చేసే మంచి చెడు పనులను బట్టి సంకేతాలు కనిపిస్తాయని అంటూ ఉంటారు. అయితే మనకు మంచి సమయం స్టార్ట్ అయిందని ఎలా తెలుస్తుంది అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. మనకు మంచి రోజులు మొదలయ్యాయి అనడానికి ముందుగా కొన్ని రకాల సంకేతాలు ఇంట్లో కనిపిస్తాయని చెబుతున్నారు. అవి మనకు మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి సంకేతంగా భావించాలని చెబుతున్నారు.
మరి ఇంట్లో ఎలాంటి సంకేతాలు కనిపిస్తే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా వాస్తు శాస్త్రం ప్రకారం మీకు కలలో నిత్యం దేవతలు కనిపిస్తే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అనడానికి సంకేతంగా భావించాలట. అలాగే కారణం లేకుండా మీరు సంతోషంగా ఉన్నా మీకు మంచి రోజులు ప్రారంభమైనట్టే భావించాలని అర్థం అని అంటున్నారు. ఎవరి ఇంటి ముందుకైనా ఆవు పదేపదే వస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదట. వీలైతే ఆవుకు ఆహారం అందించాలని ఇది మీకు చాలా మంచి చేస్తుందని చెబుతున్నారు.
ఒక వ్యక్తికి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిత్యం మెలుకువ వస్తే అది కూడా శుభసూచకంగా బాచించాలట. మీ జీవితం సరైన మార్గంలోకి రాబోతోందీ అనడానికి అర్థం అని అంటున్నారు. ఇంట్లో ప్రతిరోజూ భగవంతుడి నామస్మరణ వినిపిస్తుంటే ఇంట్లో సంతోషం కొలువై ఉందని అర్థం అంటున్నారు. మీ ఇంటి చుట్టుపక్కల నిత్యం శ్లోకాలు, దేవుడి మంత్రాలు వినిపించినా మీకు అది మంచి సంకేతమే అని అంటున్నారు. ఇలా పైన చెప్పిన సంకేతాలు మీకు కూడా కనిపిస్తున్నట్లయితే మీకు కూడా మంచి రోజులు మొదలైనట్టే అని చెబుతున్నారు పండితులు.
Spirituality: మీ ఇంట్లో కూడా ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే!

Spirituality