God In Dream: కలలో దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుంది.. అలా కనిపించడానికి సంకేతలు ఏంటి?

సాధారణంగా నిద్రపోయే సమయంలో ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. కొన్ని సార్లు మంచి కలలు వస్తే,మరి

Published By: HashtagU Telugu Desk
Dream

Dream

సాధారణంగా నిద్రపోయే సమయంలో ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. కొన్ని సార్లు మంచి కలలు వస్తే,మరి కొన్నిసార్లు పీడకలలు వస్తూ ఉంటాయి. అయితే పీడకలలు వచ్చినప్పుడు చాలా మంది కీడు జరుగుతుంది అని భయపడుతూ ఉంటారు. ఆ సమయంలో దేవుని తలచుకొని ఏం జరగకూడదు దేవుడా అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకవేళ దేవుడే మనకు కలలో కనిపిస్తే అప్పుడు ఏం జరుగుతుంది. దేవుడు కలలో కనిపిస్తే ప్రయోజనాలు ఉంటాయా? లేకపోతే నష్టాలు ఉంటాయా?

పూర్తి వివరాల్లోకి వెళితే.. సాధారణంగా దేవుడు కలలో కనిపిస్తే అది ఒక మంచికి శుభపరిణామం అని చెప్పవచ్చు. ఇదే మనం ఏదైనా విషయాలలో పూర్తిగా నమ్మకం కోల్పోయినప్పుడు, ఇటువంటి సమయంలో దేవుడు కలలో కనిపిస్తే అప్పుడు జరగవు అని అనుకున్న పనులు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మనం ఏదైనా ఒక విషయంలో ఆలోచన తీసుకోవడానికి సతమతమవుతున్నప్పుడు ఆ సమయంలో దేవుడు కలలో కనిపించాడు అంటే మీ అంతరంగాన్ని నమ్మండి అని మీకు దేవుడు సందేశం ఇచ్చినట్లే.

అదేవిధంగా దేవుడు కలలో కనిపిస్తే ఆయన ఆశీస్సులు మనపై మన కుటుంబంలో ఉన్న వారిపై ఉన్నట్లే లెక్క. అదేవిధంగా కష్టాల్లో ఉన్నవారు త్వరలోనే బయటపడతారు అని అర్థం. అదేవిధంగా దేవుడు కలలో కనిపిస్తే అన్ని మంచికే అని అనుకోకూడదు. ఎందుకంటే అప్పుడప్పుడు దేవుడికి మీపై కోపం వచ్చి కూడా కలలో కనిపిస్తూ ఉంటాడు. అదేవిధంగా దేవుడికి మొక్కుకున్న మొక్కు తీర్చుకోకపోతే కూడా దేవుడు కలలో కనిపించారు అని అనుకోవచ్చు.

  Last Updated: 22 Jul 2022, 11:29 PM IST