మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు రకరకాల కలలు రావడం అన్నది సహజం. ఇక కలలో మనుషులు, జంతువులు,ప్రకృతి, పక్షులు ఇలా ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు వస్తే మరికొన్ని చెడ్డ కలలు కూడా వస్తూ ఉంటాయి. అయితే కలలో మీకు కొన్ని కనిపిస్తే మీకు త్వరలో రాజయోగం పట్టబోతున్నట్టు అని అంటున్నారు పండితులు. దశ తిరగడం ఖాయం అంటున్నారు. మరి కలలో ఎలాంటివి కనిపిస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలలో కనుక తామర పువ్వు కన్పిస్తే లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలట.
కలలో తామర పువ్వు కనిపిస్తే ఆకస్మిక ధనలాభానికి సూచనగా చెప్పుకొవచ్చట. కలలో ఏనుగు కనిపిస్తే మనకు రాబోయే ఆటంకాలు దూరం కాబోతున్నాయని అర్థం అంటున్నారు. అందుకు ప్రతిరోజు వినాయకుడ్ని పూజించాలట. అలాగే ఆవుల్లో సకల దేవతలు కొలువై ఉంటారని అంటారు. అలాంటి ఆవు కనుక కలలో కనిపిస్తే సక్సెస్ రాబోతోందని,ఉన్నతమైన స్థానానికి ఎదగబోతున్నారని అర్థం. చాలామంది గుడ్లుగూబ ను కొందరు చెడుకు గుర్తుగా భావిస్తారు. కానీ గుడ్లగుబ అరుపులు మంచి కావని చెప్తుంటారు. అదే విధంగా ఇది కలలో కన్పిస్తే మాత్రం అలర్ట్ గా ఉండాలట.
కలలో పాము కనిపిస్తే రాబోయే ఇబ్బందులకు సూచిక భావించాలట. పాము మన ముందు నుంచి కుడివైపు నుంచి ఎడమకు పోతే లేదా పాము మనవైపు చూసి పగడ విప్పుకుని కాసేపు చూసి వెళ్లిపోతే అది ఆశీర్వదించినట్లు అర్థం. ఇలాంటి కలలో కన్పిస్తే ఉద్యోగంలో ప్రమోషన్ లతో పాటు, డబ్బుల ప్రయోజనాలు కల్గుతాయని అర్థం.