Dream: కలలో మీకు ఈ మూడు కనిపించాయా.. అయితే మీకు మంచి రోజులు స్టార్ట్ అయినట్లే!

కలలో మనకు మూడు రకాల వస్తువులు కనిపిస్తే ఇకమీదట అంతా మంచే జరుగుతుందని, మంచి రోజులు మొదలైనట్టే అని చెబుతున్నారు పండితులు.

Published By: HashtagU Telugu Desk
Dream

Dream

మామూలుగా మనం పడుకున్నప్పుడు అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు, అయితే మరికొన్ని చెడ్డ కలలు. మంచి కలలు వచ్చినప్పుడు కొంతమంది చాలా సంతోష పడుతూ చెడ్డ కలలు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు. కాగా స్వప్న శాస్త్ర ప్రకారం కలలో భవిష్యత్తును సూచిస్తాయని అంటూ ఉంటారు. అనగా మనకు భవిష్యత్తులో జరగబోయే ముందుగానే కల రూపంలో వస్తాయని చెబుతుంటారు. ఇకపోతే కలలో మనకు మూడు రకాల వస్తువులు కనిపిస్తే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని రాజయోగం పట్టినట్టే అంటున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికొస్తే..

కలలో మనకు కొత్త నోట్లు కనిపిస్తే అది చాలా మంచిదని దానిని శుభసంకేతంగా భావించాలని చెబుతున్నారు. ఇలా కలలో కొత్త నోట్లు కనిపిస్తే మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అర్థం అంటున్నారు పండితులు. అదేవిధంగా కలలో నాణేలు కనిపిస్తే శుభప్రదంగా భావించాలని చెబుతున్నారు. ముఖ్యంగా కలలో బంగారు నాణేలు కనిపిస్తే మరింత మంచిదని అంటున్నారు. ఇలా మీరు చేస్తున్న ఉద్యోగంలో లేదా వ్యాపారంలో వృద్ధి లభించనుందని పండితులు అంటున్నారు. ఇక కలలో ఇలాంటి అంశాలు కనిపిస్తే అప్పులు తీరబోతున్నాయని అర్థం అంటున్నారు పండితులు.

కలలో లక్ష్మీదేవీ కనిపిస్తే అది కూడా మంచి కలగా భావించాలని వాస్తు, స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కల వస్తే మీ జీవితంలో గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తీరబోయే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. కేవలం ఆర్థికపరమైన సమస్యలు మాత్రమే కాకుండా ఇతర మానసిక, కుటుంబ సంబంధిత సమస్యలు సైతం దూరం కాబోతున్నట్లు అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. సాధారణంగా అన్నీ పోగొట్లుకున్నట్లు కనిపిస్తే నెగిటివ్‌ గా భావిస్తుంటాం. కానీ నిజానికి ఇది మంచికి సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు. స్వప్న శాస్త్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం కలలో సర్వసం కోల్పోయినట్లు కనిపిస్తే మీ ఆర్థిక పరిస్థితి త్వరలోనే మెరుగుపడనున్నట్లు అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. త్వరలోనే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ దూరమై ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి.

  Last Updated: 29 Dec 2024, 07:12 PM IST