Cutting Nails: సాయంత్రం వేళ గోర్లు కత్తిరించకూడదట.. ఎందుకో తెలుసా?

సాధారణంగా చాలామందికి గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. ఇంకొందరు ఎప్పుడు పడితే అప్పుడు గోర్లను కట్ చేస్తూ

  • Written By:
  • Publish Date - December 1, 2022 / 06:30 AM IST

సాధారణంగా చాలామందికి గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. ఇంకొందరు ఎప్పుడు పడితే అప్పుడు గోర్లను కట్ చేస్తూ ఉంటారు. అయితే మన ఇంట్లోని పెద్దలు కొన్ని వారాలు అలాగే కొన్ని సమయాలలో గోర్లను కత్తిరించకూడదు అని చెబుతూ ఉంటారు. మరి ముఖ్యంగా సాయంత్రం సమయంలో గోర్లను అస్సలు కత్తిరించకూడదు అని చెబుతూ ఉంటారు. ఎందుకు అని అడిగితే సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది కాబట్టి ఆ సమయంలో గోర్లు కత్తిరిస్తే అశుభం అని చెబుతూ ఉంటారు. కానీ కారణం ఏంటి అన్నది వారికి కూడా తెలియదు. అయితే అప్పట్లోనే పెద్దలు వద్దు అని చెప్పిన విషయం వెనుక తప్పకుండా సైన్స్ రీజన్ దాగే ఉంటుంది. సాయంత్రం సమయంలో గోర్లు కత్తిరించకూడదు అన్న నియమాన్ని అన్న విషయాన్ని కేవలం భారత్లో వాళ్ళు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలలో చాలామంది ఈ ఆచారాన్ని పాటిస్తూనే ఉన్నారు.

అయితే అలా గోర్లు కత్తిరించకూడదు అని చెప్పడం వెనక ఒక శాస్త్రీయ కారణం ఉంది. ఇప్పుడు మాదిగ అప్పట్లో వీధిలైట్లు అలాగే కరెంటు సదుపాయం సరిగ్గా ఉండేది కాదు. సాయంత్రం అవగానే బుడ్డి దీపాలను వెలిగించుకొనేవారు. అప్పట్లో నెయిల్ కట్టర్లు కూడా లేకపోవడంతో గోర్లను కత్తిరించుకోవడానికి వారు కత్తి లేదా బ్లేడ్ ఉపయోగించేవారు. అయితే సూర్యస్తమైన తర్వాత చీకట్లో ఆ పదునైన వస్తువులను ఉపయోగించడం వల్ల వేలు కట్ అయ్యే అవకాశం ఉండేది. అందుకే రాత్రి సమయంలో గోర్లను కత్తిరించకూడదు. అయితే చాలామంది గోర్లు కత్తిరించొద్దు అని చెప్పినప్పుడు శాస్త్రీయాన్ని కొట్టి పడేయడంతో ఇలా దేవతలు దెయ్యాల పేర్లు చెప్పడం వల్ల నమ్మేవారు అని వాటి పేర్లు చెబుతూ ఉంటారు.

శాస్త్రీయ కారణాల కంటే మూఢనమ్మకాలు చెప్పినప్పుడే జనాలు ఎక్కువగా నమ్ముతారు. ఆచరిస్తారు అందుకే వినని వాళ్లకు అలా చెప్పేవారు. పగటి సమయంలో ఇంట్లో చేతి గోర్లను లేదా కాలి గోర్లను కత్తిరించుకోవడం వల్ల అపరిశుభ్రమైన మృత చర్మ కణాలు ఇంట్లో అక్కడక్కడా పడిపోవచ్చు. అవి అనుకోకుండా ఆహారాన్ని కలుషితం చేస్తాయి లేదా బట్టలకు అంటుకుంటాయి. ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాటిని తెలియకుండా నోట్లో వేసుకోవడం వల్ల చాలా ప్రమాదం. అందుకే సాయంత్రం సమయంలో గోర్లను కత్తిరించకూడదు అని చెబుతూ ఉంటారు. ఒకటి సమయంలో గోర్లను కత్తిరించినప్పుడు వాటిని ఏదైనా చిన్న పేపర్లో తీసుకొని దూరంగా పడేయాలి.