Site icon HashtagU Telugu

Saturday: శనివారం రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదట.. చేశారో అంతే సంగతులు!

Lord Shani

Lord Shani

వారంలో శనివారం రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ శనివారం రోజున శనీశ్వరుడిని అలాగే వెంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. శనివారం ఆయా దేవుళ్లకు అంకితం చేయబడింది. ఇక ఈ రోజున కొన్ని రకాల పనులు చేయడం కూడా నిషిద్ధం. తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి శనివారం రోజు ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే..

శనివారం రోజు అగ్గి పెట్టే,సూది,బొగ్గు,పత్తి,ఇనుము వంటి వస్తువులను కొనుగోలు చేయకూడదట. అదేవిధంగా శనివారం రోజు గుమ్మడికాయ ఇంట్లోకి తీసుకు రాకూడదని చెబుతున్నారు. శనివారం రోజు ఉప్పును కూడా కొనుగోలు చేయకూడదట. అలాగే ఆయిల్ వంటివి కూడా కొనుగోలు చేయకూడదని అలా కొనుగోలు చేస్తే కష్టాల పాలవ్వడం ఖాయం అంటున్నారు. శనివారం రోజున శని దేవుడికి ఇష్టమైన నువ్వుల నూనె ఇంటికి తీసుకు రాకూడదట. ఎవరి నుంచి అప్పుగా తీసుకోకూడదట. ఇలా చేస్తే అప్పుల పాలవ్వడం కాయం అంటున్నారు. అలాగే శనివారం రోజు శనీశ్వరుడికి ఇష్టమైన నల్ల మినప్పప్పు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురాకూడదట.

కొందరికి రోజూ తల స్నానం చేసే అలవాటు ఉంటుంది. అయితే పొరపాటున కూడా శనివారం జుట్టుకు తల స్నానం చేయవద్దు. ముఖ్యంగా స్త్రీలు ఈ రోజు జుట్టు కడగడం అశుభం, ఇంటిపై చెడు ప్రభావం చూపుతుందట. శనివారం రోజున ఏ జంతువుకు హానీ కలిగించకూడదట. మీరు మాంసాహారులైతే ఈ రోజు పొరపాటున కూడా మాంసాన్ని తినకూడదట. బదులుగా మీరు పేదలకు సహాయం చేయడం వల్ల శనీశ్వరుడు సంతోషపడతాడట. శనివారం పొరపాటున కూడా ఆవనూనె లేదా మరేదైనా నూనె కొనుగోలు చేయకూడదు. ఈ రోజు నూనె కొంటే ఇంట్లో దారిద్య్రం వస్తుందని నమ్ముతారు. అయితే శనివారం రోజున నూనె దానం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఆవాల నూనె, లేదా నువ్వుల నూనెను దానం చేయడంవలన శనీశ్వరుడు సంతోషపడతాడట.