Site icon HashtagU Telugu

Saturday: శనివారం రోజు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే సంపద మొత్తం కరిగిపోవడం ఖాయం!

Shani Dev

Shani Dev

వారంలో శనివారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజున శనిస్వరుడిని, వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. నవ గ్రహాల్లో ఎంతో ముఖ్యమైన శని దేవుడిని ఈ రోజున ఆరాధిస్తే కష్టాలను తొలగిస్తాడని నమ్మకం. ఈ రోజున స్వామిని పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పక కలుగుతుందట. అయితే శనివారం రోజు కొన్ని రకాల పనులు చేస్తే ఏరికోరి మరి కష్టాలను తెచ్చుకున్నట్లే అని చెబుతున్నారు. మరి శనివారం రోజు ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే..
సహజంగానే శని దేవుడు శ్రామికులకు కారకత్వం వహిస్తాడు.

ఎవరైతే తమ శ్రమను నమ్ముకుని ఒళ్లొంచి పని చేస్తారో వారిని ఈ గ్రహం ఎట్టి పరిస్థితుల్లోనూ బాధించదని చెబుతున్నారు. రోడ్లు శుభ్రం చేసే కార్మికులు, కూలీలు, విపరీతమైన శ్రమకోర్చి పని చేసేవారందరికీ శనిదేవుడే కారకుడు. అయితే శనివారం రోజున తెలిసీ తెలియక కూడా ఇటువంటి కార్మికులను కష్టపెట్టకూడదట. అలాంటి వారు శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారట. వారిని ఆదిరించి వారి పట్ల మర్యాదతో వ్యవహరించాలట. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని తక్కువ చేసి మాట్లాడటం, తూల నాడటం లాంటివి అస్సలు చేయకూడదట. అలాగే జాతకంలో ఏలినాటి శనితో బాధపడుతున్న వారు ఈ రోజున వారికి చేతనైనంత మేర సాయం చేయడం, అన్నదానం చేయడం వంటివి చేస్తే ఈ గ్రహ దోషాల నుంచి విముక్తి పొందవచ్చట.

ఎవరైతే తమ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటారో వారిని శని దేవుడు బాధించడట. ఎక్కడైతే అపరిశుభ్రత తాండవిస్తుందో అక్కడ వ్యక్తులు అనారోగ్యాల బారిన పడటంతో పాటు, శని ఆగ్రహిస్తాడట. డబ్బులు కూడా ఇంట నిలవదట. నిత్యం గొడవలతో ఆ ఇంట్లోని వారంతా మన శ్శాంతిని కోల్పోతారు. అందుకే ఇంటిని శుభ్రం చేసుకోవడానికి మిగిలిన వారాల కన్నా శనివారం అనువైన రోజు. ముఖ్యంగా ఇంట్లోని సింకులు, బాత్రూంలను ఈ రోజున శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శని కారణంగా ఎదురయ్యే అనారోగ్యాలు, ఇబ్బందులు ఆ ఇంట్లోని వారిని ఏమీ చేయవట. శనివారం రోజున తలకు నూనె రాసుకోవడం, నువ్వుల నూనెను కొని తీసుకురావడం మంచిది కాదట. ఈ రోజున తలస్నానం ఎంతో శ్రేష్ఠమైనదట. మంగళవారం చేసే తల స్నానాన్ని అమంగళమైనదిగా భావిస్తారు. అలాగే శనివారం రోజున తలస్నానం చేస్తే శని దేవుడి కారణంగా భోగభాగ్యాలను పొందుతారట.