హిందూమతంలో శనిదేవుడుని న్యాయదేవుడుగా పిలుస్తారు. మనం చేసే మంచి చెడు పనులను బట్టి శుభ అశుభ ఫలితాలను అందిస్తాడని భక్తుల నమ్మకం. ఇకపోతే శనివారం రోజు శనీశ్వరునికి అంకితం చేయబడింది. ఈరోజున ఆయనను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తులు నమ్మకం. కాగా శని దేవుడు సూర్య భగవానుడు, ఛాయదేవిల తనయుడు అన్న విషయం తెలిసిందే. శనిశ్వరుడు నలుపు రంగులో ఉండటంతో పాటుగా కాకిపై స్వారీ చేస్తాడు.
చాలా నెమ్మదిగా కదులుతాడు. అందుకే శనిశ్వరుడిని మందగమనుడు అని అంటారు. ఇకపోతే శనివారం రోజు శనీశ్వరుని పూజించడం వల్ల శని దేవుడికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయట. మరి ఇంతకీ శనివారం రోజు శని దేవుడిని ఎలా పూజించాలి అన్న విషయానికి వస్తే.. శనీశ్వరుడికి ఆవ నూనెను సమర్పించడం వల్ల ఆయన ఆశీస్సులు లభిస్తాయట. అలాగే శనిదేవునికి సంబంధించిన ఏలి నాటి శని, ధైయ్య, శని దోషం వంటి మొదలైన సమస్యలు కూడా తొలగిపోతాయట. కాగా శని దేవుడు కోపంగా ఉన్నప్పుడు, జీవితంలో విచారం, భయం, అడ్డంకులు వస్తూనే ఉంటాయట.
అయితే మనం శనివారం ఆవ నూనెను సమర్పించినప్పుడు శనీశ్వరుడు సంతోషిస్తాడట. అలాగే జీవితంలోని కష్టాలు కూడా తగ్గుతాయట. ఇది ప్రజల మనసుకు ప్రశాంతతను ఇస్తుందట. పనిలో విజయం సాధిస్తారనీ, చెడు ఆలోచనలను కూడా తొలగిస్తాడట. ఇలా నువ్వుల నూనె లేదా ఆవ నూనెను మనం శనిశ్వరుడు ప్రసన్నం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందవచ్చట.అలాగే పూజ సమయంలో దీపాలను వెలిగించడానికి ఆవనూనె ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయట. దీనివల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందట. ఆవ నూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరం బలపడుతుందట. అలాగే ఇది రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుందట.