Saturday Puja Tips: శని దోష నివారణ కావాలంటే శనివారం ఆంజనేయస్వామిని అలా పూజించాల్సిందే?

నవగ్రహాలలో ఒకటైన శనీశ్వరుడు గురించి మనందరికీ తెలిసిందే. ఈయనను న్యాయదేవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం చేసే పనులను బట్టి శుభ అశు

  • Written By:
  • Publish Date - January 9, 2024 / 09:30 PM IST

నవగ్రహాలలో ఒకటైన శనీశ్వరుడు గురించి మనందరికీ తెలిసిందే. ఈయనను న్యాయదేవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం చేసే పనులను బట్టి శుభ అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు శనీశ్వరుడు. అందుకే శనీశ్వరుని ఆరాధనకు శనివారం ప్రత్యేకంగా భావిస్తారు. శనీశ్వరుడు అశుభ ప్రభావాలను తగ్గించడానికి అనుగ్రహాన్ని పొందడానికి వివిధ రకాల పూజలను చేస్తారు. శనిదేవుని అనుగ్రహం కోసం ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెను సమర్పిస్తారు. చాలా మంది శనీశ్వరుని అనుగ్రహం పొందడానికి ఈ చర్యను పురాతన సంప్రదాయంగా భావిస్తారు.
కాగా పౌరాణిక విశ్వాసాల ప్రకారం హనుమంతుడు పై శనీశ్వర ప్రభావం ప్రారంభం కావాల్సిన సమయం ఆసన్నం అయింది.

అప్పుడు హనుమంతుడి అధ్వర్యంలో సముద్రం మీద రామసేతును నిర్మించే పని జరుగుతోంది. ఈ వంతెన నిర్మాణాన్ని రాక్షసులు అడ్డుకుంటారనే భయంతో వంతెనను రక్షించే బాధ్యత హనుమంతుడికి అప్పగించారు. అయితే అదే సమయంలో హనుమంతునిపై శనిగ్రహ కాలం ప్రారంభమవుతుంది. హనుమంతుడి శక్తి , కీర్తిని తెలుసుకున్న శనిశ్వరుడు గ్రహ కదలికల అమరిక, నియమాలను వివరించి తన కర్తవ్యాన్ని వివరించాడు. అప్పుడు హనుమంతుడు ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం తనకు ఇష్టం లేదని, అయితే తాను ఇప్పుడు రాముడికి సేవ చేయడం తనకు అత్యంత ప్రధానమని శనిస్వరునికి చెప్పాడు.శ్రీ రాముడు పని పూర్తి చేసిన తర్వాత మొత్తం శరీరాన్ని శనిశ్వరుడికి అంకితం చేస్తానని హనుమంతుడు చెప్పాడు.

అయితే హనుమంతుడు చేసిన అభ్యర్థనను శనిదేవుడు అంగీకరించలేదు. శనిదేవుడు అదృశ్య రూపంలో హనుమంతుడి శరీరాన్ని ఆవహించాడు. అప్పుడు హనుమంతుడు సేతు నిర్మాణం కోసం రాళ్ళని కొట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలో హనుమాన్ ని ఆవహించి ఉన్న శనిదేవుడుకి తీవ్రగాయాలు అయ్యాయి. శరీరంలోని ప్రతి భాగం గాయపడింది. అప్పుడు శనిదేవుడు తన చర్యకు హనుమంతుడికి క్షమాపణలు చెప్పాడు. అంతేకాదు హనుమంతుడిని పూజించే భక్తులకు తను ఎప్పడూ హాని చేయనని శనీశ్వరుడు వాగ్దానం చేశాడు. అప్పుడు రామ భక్త హనుమాన్ శనిదేవుడు ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం కోసం నువ్వుల నూనె ఇచ్చాడు. అప్పుడు తన శరీరానికి నువ్వుల నూనెను పూసుకోవడంతో అతని నొప్పులు తగ్గాయి. అప్పటి నుండి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెను నైవేద్యంగా పెడతారు. కాబట్టి శని దోష నివారణ కావాలి అనుకున్న వారు హనుమంతుడిని పూజించడంతోపాటు శనివారం రోజు శనీశ్వరుడికి నువ్వు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల శనికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే శనీశ్వరుడు అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది.