Site icon HashtagU Telugu

Sashtanga Namaskar: స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదో తెలుసా?

Sashtanga Namaskar

Sashtanga Namaskar

సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు లేదంటే పెద్దల కాళ్లకు నమస్కారం చేసినప్పుడు కొందరు మోకాళ్లపై కూర్చుని నమస్కారం చేస్తే ఇంకొందరు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు. కానీ స్త్రీలు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయరు. మరి స్త్రీలి ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయరు? ఎందుకు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాష్టాంగ అంటే ఎనిమిది అంగాలతో కలిసి నమస్కారం చేయడం. మరి ఆ ఎనిమిది అంగాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. తొడలు, తల, కళ్ళు, హృదయం, నోరు, పాదములు, చేతులు, చెవులు.

అయితే మాములుగా మానవులు ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగాలతో చేసిన తప్పులు క్షమించమని అడగాలి. ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక ఉండి చేయాలి. అయితే మరి స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అన్న విషయానికి వస్తే.. స్త్రీలు కేవలం పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలి. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలంటే పొట్ట నేలకు తాకుతుంది.

ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. పాలిచ్చి పోషించే వక్షస్థలం కూడా నేలకు తాకుతాయి. ఇలా చేయడం వల్ల ఏదైనా జరగరానిది జరిగే అవకాశం ఉంది. మన శాస్త్రాల్లో స్త్రీకి గొప్ప విలువ ఉంటుంది. సృష్టికి ఆధారమైన, పోషణకు ఆధారమైన స్థలం నేలకి తాకకూడదు. అందుకే మరీ అంతలా అనుకుంటే నడుం వంచి ప్రార్థించవచ్చు. అందుకే స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయరాదు. శరీర భౌతిక నిర్మాణాన్ని బట్టి ఈ సూచన చేశారు. పూజ పూర్తైన తర్వాత భగవంతుడికి సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చేయాలి.