Site icon HashtagU Telugu

Diwali: పిల్లలకు దీపావళి అంటే అర్థం చెప్పడం ఎలా?

Diwali

Diwali

Diwali: దివాళీ (Diwali) కేవలం దీపాలు, స్వీట్ల పండుగ మాత్రమే కాదు. మంచితనం విజయం, ఆత్మ శుద్ధికి సంబంధించిన గొప్ప వేడుక. కానీ చిన్న పిల్లల విషయానికి వస్తే ఈ పండుగ వారికి కేవలం పటాకులు, బహుమతులకే పరిమితం కాకుండా ఉండాలంటే వారికి దీపావళి అర్థాన్ని హృదయపూర్వకంగా వివరించడం అవసరం. కథ రూపంలో ఆట ద్వారా లేదా అనుభవం రూపంలో వారికి నేర్పవచ్చు.

కథ ద్వారా చెప్పండి- చీకటిపై వెలుగు విజయం

పిల్లలు కథలతో చాలా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. వారికి రామాయణం కథ చెప్పండి. శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తరువాత అయోధ్యకు ఎలా తిరిగి వచ్చారో? మొత్తం నగరం దీపాలు వెలిగించి ఆయనకు ఎలా స్వాగతం పలికిందో వివరించండి. ఆ తర్వాత దీపం వెలిగించడం అంటే కేవలం ఇంటిని మాత్రమే కాదు, మన మనసును కూడా ప్రకాశింపజేయడం అని చెప్పండి. మంచి ఆలోచనలు, నిజాయితీ, ప్రేమ అనే వెలుగుతో ప్రపంచాన్ని మెరుగుపరచడం దీని అంతరార్థం.

పండుగ అంటే కేవలం సరదా కాదు, బాధ్యత కూడా

లక్ష్మీదేవి శుభ్రమైన ఇంట్లోనే కొలువై ఉంటుంది కదా అలాగే మనం కూడా మన గదిని, బొమ్మలను, పుస్తకాలను చక్కగా సద్దుకోవాలి అని పిల్లలకు చెప్పండి. పిల్లలను వారి బొమ్మలు లేదా పడకను వారే అలంకరించేలా ప్రోత్సహించండి. దీనివల్ల వారు పండుగ అంటే కేవలం సరదా మాత్రమే కాదు బాధ్యత కూడా నేర్పుతుందని తెలుసుకుంటారు.

Also Read: IND vs AUS: ఆస్ట్రేలియా సిరీస్.. కోహ్లీ, రోహిత్‌తో సహా టీమిండియా ఆ రోజునే బయలుదేరనుంది!

మతతత్వం కాదు- మానవత్వాన్ని నేర్పండి

దీపావళి అంటే ఏ మతం గెలిచిందని కాదు. సత్యం, కష్టం, ప్రేమ గెలిచిందని పిల్లలకు చెప్పండి. పిల్లల హృదయంలో ఇతరుల పట్ల దయ, పెద్దల పట్ల గౌరవం, పేదల పట్ల కరుణ అనే దీపాలను వెలిగించండి. పేదవారికి మిఠాయి ఇవ్వడం లేదా కొత్త బట్టలు ఇవ్వడం కూడా పూజలో ఒక భాగమేనని వారికి నేర్పండి.

ఆర్ట్, దీపం, కథ – సృజనాత్మకత

పిల్లల్లో సృజనాత్మకత భావనను పెంచడానికి దీపావళి పండుగ అత్యుత్తమ అవకాశం. వారిచేత దీపాలకు రంగులు వేయించండి. పేపర్ ల్యాంప్స్ తయారు చేయించండి లేదా ఇంటి అలంకరణలో భాగం చేయండి. దీనివల్ల పిల్లలు పండుగను సృజన, భాగస్వామ్యంగా భావిస్తారు. పూర్వం ప్రజలు మొత్తం వీధివారితో కలిసి దీపావళి చేసుకున్నట్లే.

పటాకులకు ప్రత్యామ్నాయం చెప్పి, ప్రకృతి పట్ల బాధ్యత నేర్పండి

పటాకులు కేవలం క్షణికావేశపు మెరుపు మాత్రమే. కానీ చెట్లు నాటడం, పక్షులకు ఆహారం ఇవ్వడం, నీటిని ఆదా చేయడం వంటివి నిజమైన దీపాలు వెలిగించినట్లే అని పిల్లలకు వివరించండి. లక్ష్మీదేవి ఎక్కడ శుభ్రత, శాంతి, పర్యావరణ రక్షణ ఉంటాయో అక్కడికే వస్తుందని చెప్పండి.

లక్ష్మీ పూజ అసలు అర్థం

లక్ష్మీదేవి ధనానికి మాత్రమే కాదు. సద్బుద్ధి, సంతృప్తికి కూడా దేవత అని పిల్లలకు చెప్పండి. నిజాయితీగా కష్టపడేవాడే అసలు ధనవంతుడు. అందుకే పూజ చేసేటప్పుడు తాము కష్టం, సత్యం అనే మార్గంలో ఉండాలని తల్లిని కోరుతున్నట్లు పిల్లలతో చెప్పించండి.

పంచడం అంటే ప్రేమించడం – ఇదే అసలు సందేశం

దీపావళి సందర్భంగా ఆనందాన్ని పంచుకోవడం అనేది అతిపెద్ద బహుమతి అని పిల్లలకు నేర్పండి. అవసరం ఉన్నవారికి దీపం లేదా మిఠాయి ఇవ్వడం. ఒక పేద పిల్లవాడితో సమయం గడపడం ఇదే అసలైన దీపావళి పూజ.

Exit mobile version