Site icon HashtagU Telugu

Sankranti 2024 Date: మకర సంక్రాంతి ఎప్పుడు? రాత్రి పగల్లో ఎందుకు మార్పులు వస్తాయో తెలుసా?

Mixcollage 03 Jan 2024 04 57 Pm 54

Mixcollage 03 Jan 2024 04 57 Pm 54

హిందువులు జరుపుకునే మొట్టమొదటి పండుగ సంక్రాంతి. ఈ పండుగను మూడు రోజులపాటు జరుపుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే సూర్యుడు తన కక్ష్యను మార్చుకునే రాశిని సంక్రాంతి అంటారు. ఈ కక్ష్యలో మార్పులు రావడం వల్ల పగటి సమయం పెరిగి, రాత్రి వ్యవధి తగ్గుతుంది. అలా ఈ సంవత్సరం మకర సంక్రాంతి పండుగను శతభిషా నక్షత్రంలో వ్యతిపాత యోగం శుక్ల పక్ష చతుర్థి తిథిలో సోమవారం వచ్చింది. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఉత్తరాయణ కాలాన్ని దేవతల పగలని, దక్షిణాయనాన్ని దేవతల రాత్రిగా పరిగణిస్తారు.

అయితే ఈ ఏడాది రాబోయే సంక్రాంతి పండగకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గత ఏడాది కంటే ఈ సంవత్సరం వచ్చే పండగ సమయంలో తిథుల్లో మార్పులు రావడం వల్ల పండగను ఏయే సమయాల్లో జరుపుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. ఈ ఏడాది కూడా జనవరి 15న మకర సంక్రాంతిని జరుపుకోవడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇంతకుముందు 2022, 2023లో కూడా మకర సంక్రాంతిని జనవరి 15న వచ్చింది. సూర్యుడు జనవరి 15 ఉదయం 8:30 గంటలకు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి సంచారం చేస్తాడు.

ఉదయం 8:42 గంటలకు సంచారం జరుగుతుంది. కాబట్టి జనవరి 15న పండగను జరుపుకోవడం చాలా మంచిది. మరి ఆరోజు ఏం చేయాలి అన్న విషయానికొస్తే.. మకర సంక్రాంతి రోజున గంగాస్నానం ఆచరించడం చాలా శుభప్రదం. అంతేకాకుండా ఈ రోజు నలుగు పేదలకు దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. దీంతో పాటు పూర్వ జన్మలలో తెలిసి, తెలియక చేసిన పాపాలు కూడా నశిస్తాయి. మకర సంక్రాంతి రోజున గంగాస్నానం చేసి దుప్పట్లు, నెయ్యి, నువ్వులు, లడ్డూలు, వస్త్రాలు దానం చేయడం ఊహించని లాభాలు కలుగతాయి. దీంతో పాటు మానసిక, ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి. అలా ఈ ఏడాది 14 బోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగను జరుపుకోవాలి.