Sankranthi Muggulu: సంక్రాంతి రోజు ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

సంక్రాంతి పండుగ అంటే చాలు రంగురంగుల ముగ్గులు, కోడి పందాలు గాలిపటాలు ఎగరేయడం పిండి వంటలు, గంగిరెద్దులు ఇలా ఎన్నో రకాల విషయాలను గుర్తుకు వ

  • Written By:
  • Publish Date - January 14, 2024 / 07:00 PM IST

సంక్రాంతి పండుగ అంటే చాలు రంగురంగుల ముగ్గులు, కోడి పందాలు గాలిపటాలు ఎగరేయడం పిండి వంటలు, గంగిరెద్దులు ఇలా ఎన్నో రకాల విషయాలను గుర్తుకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు స్త్రీలు పెద్దపెద్ద ముగ్గులు వేసి వాటిని అనేక రంగులు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు సంక్రాంతి పండుగ
ముగ్గులు పెట్టడం నుంచి మొదలుకొని గొబ్బెమ్మలు తయారు చేయడం, ముగ్గులను బంతిపూలతో అలంకరించడం ఇలా మహిళలు చాలా బిజీగా ఉంటారు. ఇక మకర సంక్రాంతి రోజు అయితే మహిళలు వారిలో ఉన్న క్రియేటివిటీ మొత్తం ముగ్గుల రూపంలో బయటపడుతూ ఉంటారు.

అందమైన ముగ్గులు వేయడమే కాకుండా ఆకర్షనీయంగా కనిపించేందుకు రంగులను కూడా నింపుతూ ఉంటారు. అసలు మకర సంక్రాంతి రోజు ముగ్గులు ఎందుకు వేస్తారు? ముగ్గులు వేయకుంటే ఏం జరుగుతుంది?అసలు పురాణాలు ఏం చెబుతున్నాయి? అన్న వివరాల్లోకి వెళితే.. గ్రామాల్లో నైతే చాలావరకు ముగ్గులను మట్టి నేలపై పూర్తిగా బియ్యప్పిండితో గీస్తూ ఉంటారు మరి కొంతమంది అయితే ముగ్గుల పిండిని ముందుగానే సిద్ధం చేసుకుని ముగ్గులను పెడతారు. ఇక పట్టణాల్లో నైతే మట్టి నేల కనిపించదు కాబట్టి ఫ్లోరింగ్ పై చాక్​పీస్​తో వేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఫ్లోరింగ్ పై కూడా బియ్యప్పిండి ముగ్గుల పిండితో వేస్తూ ఉంటారు.

ఇలా ఒక్కొక్కరు వారికి అందుబాటులో ఉన్న వాటితో ముగ్గులను వేస్తూ ఉంటారు. సంక్రాంతి పండగ రోజున చాలామంది ఎక్కువగా చుక్కల ముగ్గులను వేస్తూ ఉంటారు. ముగ్గులను గొబ్బెమ్మలను తయారుచేసి పెడతారు. అయితే కొంతమంది బద్ధకంగా ఉండి ముగ్గులు పెట్టడం మానుకుంటారు. సంక్రాంతి పండగ రోజు ఎవరి ఇంటి ముందు అయితే ఉదయం పూట ముగ్గులు పెట్టుకోరో వారి ఇంటికి లక్ష్మీదేవి రాదని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ పండగ రోజు ఉదయం పూట సాక్షాత్తు లక్ష్మీదేవి వీధుల్లోకి వస్తుందట. మకర సంక్రాంతి రోజు ఎవరైతే ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెడతారో వారి ఇంటికి లక్ష్మీదేవి వచ్చి ఆశీర్వదిస్తుందట. అంతేకాకుండా ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సంక్రాంతి మూడు రోజులపాటు తప్పకుండా ముగ్గులు పెట్టుకోవాలి.