Sandals: గుడి దగ్గర చెప్పులు పోవడం మంచిదేనా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

మామూలుగా మనం కొన్ని కొన్ని సార్లు దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆలయం బయట చెప్పులు విడిచి వెళుతూ ఉంటాం. అప్పుడు కొందరు పొరపాటున మన చెప్పుల

  • Written By:
  • Publish Date - January 26, 2024 / 05:30 PM IST

మామూలుగా మనం కొన్ని కొన్ని సార్లు దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆలయం బయట చెప్పులు విడిచి వెళుతూ ఉంటాం. అప్పుడు కొందరు పొరపాటున మన చెప్పులను వేసుకొని వెళ్లడం లేదంటే చెప్పులు దొంగలించడం లాంటివి చేస్తూ ఉంటారు. చాలా వరకు ఆలయం వద్ద చెప్పులు దొంగలించడం లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందుకు బాధ పడాల్సిన అవసరం లేదు. ఇక చెప్పులు బయట విడిచిపెట్టి వెళ్ళేటప్పుడే చెప్పులు ఉంటాయో పోతాయో అన్న భయంతోనే ఆలయానికి వెళ్తారు. అయితే ఆలయాల వద్ద చెప్పులు పోతే బాధపడాల్సిన అవసరం లేదు. చెప్పులు విడిచేటప్పుడు పోతాయేమోనని ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు.

ఒకవేళ ఆలయాల వద్ద మీ చెప్పులు చోరీకి గురైతే బాధ పడటం మానేసి సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆలయాల వద్ద చెప్పులు పోవడం మన జీవితంలో జరిగే శుభాలకు సంకేతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పులు పోవడాన్ని అదృష్టంగా చెప్పవచ్చు. చెప్పులు పోతే మన జీవితంలో శని బాధలు తొలగిపోతాయని చెబుతారు. చెప్పులు చోరీకి గురైతే అప్పుల బాధ నుండి బయటపడతామని, పేదరికం నుండి విముక్తి దొరుకుతుందని అర్థం. ముఖ్యంగా శనివారం రోజు ఆలయం వద్ద చెప్పులు పోతే మరీ మంచిదని చెబుతున్నారు. శనివారం నాడు ఆలయం వద్ద చెప్పులు దొంగిలించబడితే మన జీవితంలో ఉన్న దరిద్రం కూడా తొలగిపోతుందని అర్థం.

చెప్పులను దానం చేయడం వల్ల, లేదా చెప్పులను ఎవరైనా తీసుకోవడం వల్ల శని వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని చెబుతారు. శనిగ్రహం పాదాలలో నివసిస్తుందని చాలామంది చెబుతుంటారు. అటువంటి పాదాలకు ధరించే చెప్పుల పైన శని ప్రభావం ఉంటుందని చెప్తారు. రంగులు, తోలు రెండు శనిదేవుడికి సంబంధించినవి. కాబట్టి శని దేవుడి ప్రతికూల ప్రభావాల నుంచి బయట పడటం కోసం చాలామంది కావాలని ఆలయాల వద్ద శనివారం నాడు వారి బూట్లు, చెప్పులు వదిలివేస్తారు. దీనివల్ల తమ జీవితంలోని ప్రతికూల ఫలితాలు పోతాయని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల శని దేవుడు కలిగించే బాధల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. జాతకంలో శని వక్ర దృష్టి ఉంటే మనం ఎంత కష్టపడినా అనుకున్న పనులు జరగవు. అలాంటప్పుడు ఆలయాల వద్ద చెప్పులు ఎవరైనా చోరీ చేస్తే, లేదా మనమే చెప్పులు వదిలేస్తే కచ్చితంగా కష్టాలు తొలగిపోతాయని, ఆర్థిక ఇబ్బందులు లేకుండా పోతాయని చెబుతున్నారు.