Site icon HashtagU Telugu

Vastu Tips: గ్లాసు ఉప్పును బాత్రూంలో ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా?

Salt Vastu

Salt Vastu

సాధారణంగా మనం ఇంట్లో తయారు చేసుకునే వంటల్లో ఉప్పు తక్కువ అయితే కాస్త జోడించుకొని వాటిని తింటాం. అదే వంటల్లో ఉప్పు కాస్త ఎక్కువ అయితే ఆ ఇంట్లో చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది అని చెప్పవచ్చు. ఉప్పు తక్కువ ఉన్న వంటలు అయినా తినడానికి ఇష్టపడతారేమో కానీ ఉప్పు ఎక్కువగా ఉంటే ఆ వంటలు తినడానికి కూడా రావు. ఉప్పు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు వంటలకు రుచిని కూడా ఇస్తుంది. అయితే లోబీపీ ఉన్నవారికి బిపిని నియంత్రించుకోవడంలో ఉప్పు బాగా ఉపయోగపడుతుంది.

కానీ ఉప్పును మోతాదుకు మంచి తీసుకోవడం వల్ల ఐబీపీ వస్తుంది. తద్వారా అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. అయితే ఉప్పును కేవలం వంటల్లో ఉపయోగించడానికి మాత్రమే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా ఉప్పు కు చాలా ప్రాధాన్యత ఉంది. ఉప్పు నెగటివ్ ఎనర్జీని లాగేసుకోవడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. నెగిటివ్ ఎనర్జీని లాగేసుకొని పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తుంది అని వాస్తు శ్రాస్త నిపుణులు చెబుతున్నారు.

మన ఇంట్లో ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి, అలాగే దుష్టశక్తులు,ఆటంకాలు తొలగిపోవడానికి ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. మరి ఉప్పును వాస్తు పరంగా ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇందుకోసం ఒక గ్లాస్‌లో ఉప్పును నింపాలి. ఆ తరువాత ఆ ఉప్పు నింపిన గ్లాస్ ని బాత్రూమ్‌లో ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు దూరం అయ్యి,ఆటంకాలు తొలగిపోతాయి. తద్వారా అది పురోగతి సాధించడానికి ఇది దోహదం చేస్తుంది. నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది.

Exit mobile version