Sai Baba Mantra: ఈ 12 సాయి మంత్రాలు జపిస్తే.. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి..!

షిర్డీ సాయిబాబా అద్భుతాలు ఎవరికి తెలియవు..? ఎక్కడ పుడతారో.. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. సాయిబాబా తన భక్తుల కోరికలను త్వరగా తీరుస్తాడని నమ్ముతుంటారు.

Published By: HashtagU Telugu Desk
Sai Baba

Sai Baba

షిర్డీ సాయిబాబా అద్భుతాలు ఎవరికి తెలియవు..? ఎక్కడ పుడతారో.. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. సాయిబాబా తన భక్తుల కోరికలను త్వరగా తీరుస్తాడని నమ్ముతుంటారు. గురువారం సాయిబాబా వ్రతాన్ని చిత్తశుద్ధితో ఆచరిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. సాయిబాబా మానవత్వాన్ని గొప్ప మతంగా అభివర్ణించారు. బాబా అద్భుతాలను చూసిన ప్రజలు దేవుడు అనే బిరుదును ఇచ్చారు. ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సాయిబాబా మంత్రాలను పఠించడం వల్ల ఆ వ్యక్తి జీవితంలోని దుఃఖాలన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు.

షిర్డీలోని సాయి నాథుడు చాలా దయాళువుగా పూజించబడుతాడు. తన ఆశ్రయం కోసం వచ్చే సాయి భక్తులందరికీ కష్టాలను తొలగిస్తాడు. వారు కోరుకున్న కోరికలను నెరవేరుస్తారు. సాయి భక్తుల జీవితంలో ఏవైనా సమస్యలు ఎదురవుతున్నట్లయితే, గురువారాల్లో ఈ సాయిబాబా మంత్రాలను జపించండం మంచిది. .

12 అద్భుతమైన మంత్రాలు:

1. ఓం సాయిరామ్

2. ఓం సాయి గురువాయ నమః

3. అందరికి ప్రభువు ఒక్కడే

4. ఓం సాయి దేవాయ నమః

5. ఓం షిర్డీ

6. ఓం సమాధిదేవాయ నమః

7. ఓం సర్వదేవాయ రూపాయ నమః

8. షిర్డీ వాసాయ విద్మహే

9. ఓం అజర అమరాయ నమః

10. ఓం మాలికాయ నమః

11. జయ – జయ సాయి రామ్

12. ఓం సర్వజ్ఞ సర్వ దేవతా స్వరూప అవతార.

సాయిబాబాకు సంబంధించి పై 12 మంత్రాలను పఠించడం వల్ల మన జీవితంలోని అన్ని సమస్యలు లేదా కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.

  Last Updated: 14 Oct 2022, 07:58 AM IST