Site icon HashtagU Telugu

Sabarimala : శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత

Greenfield Airport at Sabarimala

Greenfield Airport at Sabarimala

Sabarimala : ప్రముఖ పుణ్యకేత్రం శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల దీక్ష ముగిసింది. దీంతో మండల పూజ అనంతరం ఆలయాన్ని మూసివేశారు. మండల పూజలు ముగియడంతో ఈ చర్యలు తీసుకున్నారు. అయ్యప్ప స్వామిని ఇప్పటివరకు 32.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ నెల 30న ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

ఇక.. జనవరి 14న శబరిమల కొండపై భక్తులు మకరజ్యోతిని దర్శించుకోనున్నారు. జనవరి 20న పడిపూజతో శబరిమల యాత్ర ముగియనుంది. ఈ పూజతో కలిసి అయ్యప్ప స్వామి భక్తులు తాము తీసుకున్న దీక్షను ముగించుకుంటారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పూజతో యాత్రకు పూర్తి స్థాయి ముగింపు కలుగుతుంది. ఈ ప్రత్యేక ఘట్టానికి దేశవ్యాప్తంగా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు హాజరవుతారు. మకరజ్యోతి దర్శనం అయ్యప్ప స్వామి భక్తులందరికీ ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది.

కాగా, మండల పూజ కోసం క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో మలయాళీలు సహా అయ్యప్ప భక్తులు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మండల పూజ, నెయ్యాభిషేకం అనంతరం గురువారం రాత్రి 11 గంటల నుంచి డిసెంబరు 30 వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. ఇక, టీడీబీ పోర్టల్స్ కూడా అందుబాటులో ఉండవు. డిసెంబరు 30 సాయంత్రం మకర విళక్కు కోసం ఆలయం తిరిగి తెరుచుకుంటుంది. సన్నిధానంలో జనవరి 14న మకర జ్యోతి దర్శనం, జనవరి 20న పడిపూజతో యాత్రా సీజన్ ముగియనుంది.

Read Also: EPF Members: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్‌!